Begin typing your search above and press return to search.

కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకుతారెందుకు?

By:  Tupaki Desk   |   30 July 2015 3:41 PM GMT
కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకుతారెందుకు?
X
అవంతిక రేప్‌ అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. ఓ మహిళా జర్నలిస్టు రాజమౌళిని తూర్పారబట్టడం పెద్ద స్థాయిలో చర్చకొచ్చింది. ఆడవారిని ఇప్పటికీ బానిసలుగా చూస్తున్నారని విమర్శించేవాళ్లెందరో. అయితే అవంతికలో సైతం ఓ వీరనారిని చూపెట్టాలన్న ఆలోచన ఓ మగాడికే వచ్చిందన్న విషయాన్ని ఎవరూ ఎందుకు పరిగణించరు. ఓ వీరనారి మరో వీరుడిని ప్రేమించడం తప్పు ఎలా అవుతుంది. ప్రేమించింది.. మనసిచ్చింది కాబట్టే తనువు సమర్పించుకుంది అని ఎందుకు అనుకోకూడదు?

ఇలా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాజమౌళికి లేదేమో! అయినా మన తెలుగు సినిమా ఘనచరిత్రను పరిశీలిస్తే స్త్రీల ఔనత్యాన్ని చాటి చెప్పే సినిమాలెన్నో వచ్చాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకోకుండా అందరు దర్శకుల్ని , ఫిలింమేకర్స్‌ ని ఒకే గాటిన కట్టేసి తిట్టి పారేయడం ఎంతవరకూ సబబు?

అలనాటి మేటి నటి సౌందర్య అమ్మోరుగా నటించగలిగింది? అంటే అందుకు కారకులెవరు? మేటి నాయిక విజయశాంతి సోలో లీడ్‌ గా నటించి మగరాయుళ్లను తుక్కు రేగేలా ఇరగదీయడానికి కారకులెవరు? అరుంధతిగా వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి అనుష్కకు ఆ అవకాశం ఇచ్చిందెవరు? ఇలాంటి ఎన్నో గొప్ప ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నా మొత్తం మగ ప్రపంచమే ఇంతే అనేస్తే ఎలా? కాస్త ఆలోచించాలి కదా! మిల్లీ గ్రామ్‌ మనసు పెడితే మీకే అన్ని విషయాలు గుర్తొచ్చేవి కదా!