పవర్ స్టార్ హీరోయిన్ స్టిల్ అదిరే

Wed Jun 20 2018 22:41:41 GMT+0530 (IST)


పైన ఫొటోలో హాట్ గా కనిపిస్తున్న బ్యూటీని ఎక్కడో చూసినట్టు కొడుతోంది కదా.. ఆమె ఫెస్ ను జాగ్రత్తగా గమనిస్తే ఒక పాట కూడా గుర్తొస్తుంది. 1999లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఇంగ్లీష్ మీడియం పిల్లగా కనిపించింది కదా ఆ ముద్దుగుమ్మే ఈ భామ. పేరు అదితి గోవిద్రికర్.వయ్యారి భామ నీ హంస నడక సాంగ్ లో మాస్ గా కనిపించే పవన్ పక్కన స్టయిలిష్ గా కనిపించి అందరి హృదయాలను దోచేసుకుంది. ఈ బ్యూటీ 2001 లో మిస్ వరల్డ్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి హాట్ హీరోయిన్ అనిపించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా అలరించింది. అయితే అక్కడ అనుకున్నంత స్థాయిలో ఆఫర్స్ అందుకోలేదు. ఎదో క్యారెక్టర్స్ చేస్తూ ప్రస్తుతం బాలీవుడ్ లో కొనసాగుతోంది.

ఇకపోతే ఇటీవల బీచ్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ చాలా వరకు మతి పోగొట్టాయనే చెప్పాలి. నాలుగు పదుల వయసు వచ్చినా కూడా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అనే విధంగా టాక్ తెచ్చుకుంటోంది. బికినిలో అదితి గోవిద్రికర్ ఈ తరం హీరోయిన్స్ కి కూడా గట్టి పోటీని ఇవ్వగలదని కూడా అంటున్నారు.