మీటూతో స్టార్ హీరో పరువు తీసేందుకు కుట్ర!!

Mon Oct 22 2018 19:17:17 GMT+0530 (IST)

సినిమా ఇండస్ట్రీతో పాటు దాదాపు అన్ని రంగాల్లో కూడా మహిళలు లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న విషయంను అంతా ఒప్పుకోవాల్సిందే. సినిమా పరిశ్రమలో ఈ వేదింపులు కాస్త ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. అందుకే సినిమా పరిశ్రమ నుండే లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా పోరాటం మొదలు అయ్యింది. విదేశాల్లో ఉన్న మీటూ ఉద్యమం ఇండియాలో బాలీవుడ్ సినీ తారలు మొదలు పెట్టారు. బాలీవుడ్ కు చెందిన నానా పటేకర్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడంటూ తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో ఇండియాలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. ఇలాంటి సమయంలో ఈ ఉద్యమం తప్పుదారి పడుతుందని కొందరు ఆరోపిస్తున్నారు.పాత కక్షలను మనసులో పెట్టుకుని లేదా మరేదైనా కారణంతో మీటూ అంటూ కొందరు సెలబ్రెటీలు లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా అది నిజమేనేమో అనిపించే ఒక సంఘటన బాలీవుడ్ లో జరిగింది. హిందీ సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక స్టార్ హీరో పరువు తీసేందుకు స్టార్ హీరోయిన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించారట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఈమద్య హిందీలో ఆమె నటించిన ఒక చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాంతో ఆమెకు మంచి క్రేజ్ దక్కింది. ఆ కారణంగా ఆమెను వాడుకుని ఒక హిందీ స్టార్ హీరో పరువు తీయాలని ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని కొందరు భావించారట. అందుకు ఆమెకు భారీ మొత్తంలో డబ్బు కూడా ఇచ్చేందుకు వారు ఓకే చెప్పారట. కాని ఆమె మాత్రం టాక్ షోలో ఆ హీరో గురించి తప్పుడు ఆరోపణలు చేసేందుకు నో చెప్పిందట. ఆ హీరో ఎవరు ఆ హీరోయిన్ ఎవరు ఆరోపణలు చేయించాలని చూసింది ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. కాని ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు ఆ హీరోయిన్ శ్రద్దా కపూర్ అనుకుంటున్నారు మరికొందరు మరికొన్ని పేర్లు చెబుతున్నారు.

ఇలా డబ్బులు ఖర్చు చేసి ఆరోపణలు చేయించడం వల్ల మీటూ ఉద్యమంను తప్పుడు దారిలోకి తీసుకు వెళ్లడం అవుతుందని ఇది మహిళలకు ఎంత మాత్రం మంచిది కాదని మహిళలు ఈ ఉద్యమంను సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో కూడా లైంగిక వేదింపులు ఉండక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TAGS: