బర్త్ డే వేడుకలు వద్దన్న హీరో

Wed Jun 13 2018 13:20:13 GMT+0530 (IST)


స్టార్ హీరోలు అత్యంత ఆర్భాటంగా తమ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం కనిపిస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో ఫ్యాన్స్ హంగామా అయితే అస్సలు ఆపతరం కాదు. సోషల్ మీడియాలో ఈ రచ్చ మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే.. తమిళ హీరో విజయ్ మాత్రం ఈసారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట.తాను సెలబ్రేషన్స్ చేసుకోవడం మానేయడమే కాదు.. ఎక్కడా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దంటూ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కు సమాచారం ఇచ్చాడు. అంతే కాదు.. అభిమానులు అందరికీ ఓపెన్ గా పిలుపును కూడా ఇచ్చాడు. ఇందుకు కారణం.. తాజాగా ట్యూటికోరన్ లో జరిగిన కాల్పుల ఘటన అని తెలుస్తోంది. కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన.. విజయ్ ను కదిలించి వేసిందట. అందుకే ఈ ఏడాది బర్త్ డే సెలబ్రేషన్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలని డిసైడ్ అయ్యాడట ఇలయ దళపతి.

కొన్ని రోజుల క్రితం ట్యూటికోరన్ ఘటనలో మరణించిన ఓ వ్యక్తి ఇంటికి సీక్రెట్ గా వెళ్లి.. తన సానుభూతి చెప్పడమే కాకుండా లక్ష రూపాయలు అందించాడు విజయ్. తమ అభిమాన హీరో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు.. ఆదర్శంగా నిలుస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మురుగదాస్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో.