సల్మాన్-షారూక్ ఇచ్చిన రంజాన్ తోఫా!

Thu Jun 14 2018 13:28:14 GMT+0530 (IST)

ఖాన్ త్రయం అంటే బాలీవుడ్ కింగ్స్ అనే సంగతి తెలిసిందే. ఎలాంటి హీరో అయినా సరే.. వీరి తర్వాత అన్నట్లుగా ఉంటుంది వాలకం. సల్మాన్-షారూక్ ల మధ్య గతంలో సాన్నిహిత్యం అంతగా కనిపించేది కాదు కానీ.. రెండు మూడేళ్లుగా  పరిస్థితి మారింది. ఇప్పుడు ఏకంగా షారూక్ ఖాన్ సినిమాలోనే సల్మాన్ ఖాన్ దర్శనం ఇచ్చేస్తున్నాడు.షారూక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న మూవీ జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఇప్పుడీ చిత్రానికి స్పెషల్ ఈద్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో బవువా సింగ్ పాత్రలో నటిస్తున్న షారూక్ ఖాన్ ను.. సల్మాన్ ఖాన్ కలవడం అన్నదే కాన్సెప్ట్. మొదటగా అక్కడ కరతాళ ధ్వనులు అన్నీ తనకోసమే అనుకున్న షారూక్.. ఆ తర్వాత తన వెనుక నుంచుని ఉన్న సల్మాన్ ఖాన్ చూస్తాడు.

సర్కస్ లో సెంటర్ రింగ్ పై సల్మాన్ ఖాన్.. మరుగుజ్జుగా కనిపిస్తున్న షారూక్.. ఇద్దరూ కలిసి డ్యాన్సులు వేస్తుంటే ఆ సీన్ అబ్బో వర్ణనాతీతం అనాల్సిందే. అందుకే ఈ టీజర్ కు ఈద్ కు ఆనంద్ ఎల్ రాయ్ ఇస్తున్న అసలు సిసలైన గిఫ్ట్ అంటూ కామెంట్ పెట్టి మరీ షారూక్ ఖాన్ పోస్ట్ చేశాడు. రేస్3 మూవీతో సల్మాన్ ఈద్ కు వస్తుండగా.. ఇప్పుడు ఫ్యాన్స్ కు జీరో రూపంలో మరో గిఫ్ట్ అందింది.


వీడియో కోసం క్లిక్ చేయండి