Begin typing your search above and press return to search.

మహేష్ మూవీ సంచలనాలు మొదలు!

By:  Tupaki Desk   |   25 Oct 2016 8:45 AM GMT
మహేష్ మూవీ సంచలనాలు మొదలు!
X
కాంబినేషన్ ప్రకటన జరిగినప్పటి నుంచి మహేష్ బాబు - మురగదాస్ సినిమాపై పరిశ్రమలో విపరీతమైన చర్చ జరుగుతుండటంతో పాటు అభిమాన సర్కిల్స్ లో కూడా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాకు టైటిల్ ఇంకా అఫీషియల్ గా ఖరారు కానప్పటికీ... ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ రకరకాల టైటిల్స్ తో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో వాక్సోడీగామ - ఎనిమీ - అభిమన్యుడు అని రకరకాల పేర్లు ప్రచారంలోకి రాగా, వాటి సరసన తాజాగా "ఏజెంట్ శివ" అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది.

ఆ సంగతులు అలా ఉంటే... ఈ మహేష్ - మురగదాస్ సినిమాకు సంబంధించి ఒక వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే... ఈ సినిమాకు సంబంధించి "జీటీవీ" భారీ డీల్ కుదుర్చుకుందట. ఆ డీల్ విలువ సుమారు 26 కోట్ల రూపాయలట. ఈ 26 కోట్లలో తెలుగు - తమిళ శాటిలైట్ రైట్స్ కోసం 21 కోట్లు కాగా, మిగిలిన ఐదు కోట్ల రూపాయలూ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసమని టాక్!! ఇదే నిజమైతే... మహేష్ - మురగదాస్ సినిమా సంచలనాలు మొదలైపోయినట్లేనని అంటున్నారు సినీ జనాలు.

ఇదే క్రమంలో ఈ మధ్య తెలుగులో సినిమా మేకింగ్ వీడియోలను - టీజర్లను వర్చువల్ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. దీంతో మహేష్-మురగదాస్ కాంబినేషన్ మూవీ టీజర్ కూడా ఈ వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీ లో విడుదల చేయడానికి వర్క్ స్టార్ట్ అయిందట. ఈ మేరకు టైటిల్ ను అనౌన్స్ చేసే 10సెకండ్ల టీజర్ ను లాస్ ఏంజిల్స్ లోని ఓ కంపెనీ తయారుచేస్తుందని, ఈ టీజర్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారని అంటున్నారు!! కాగా తెలుగు - త‌మిళ బాషల్లో 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/