మొగుడితో డేటింగ్ చేస్తే.. కూతురెలా?

Tue Sep 12 2017 12:31:36 GMT+0530 (IST)


బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఆరితేరిపోయింది. ఎప్పటికప్పుడూ ఏదో ఒక వివాదంతో జనాలను ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. హృతిక్ రోషన్ తో గొడవ ఇంకా ఓ దారికి రాకుండాగనే.. సీనియర్ నటి జరీనా వాహబ్ పై విమర్శలు చేసింది. జరీనా భర్త ఆదిత్య పంచోలితో రిలేషన్ షిప్ లో ఉన్నపుడు.. తనను జరీనా హౌస్ అరెస్ట్ చేసిందని.. కూతురు లాంటిదాన్నని అభ్యర్ధించినా.. తిట్టిపోసిందని చెప్పుకొచ్చిందని చెప్పింది కంగనా.



అయితే.. జరీనా వాహబ్ దీనిపైనే ఎదురు ప్రశ్న వేసింది. "అప్పటికి నాలుగున్నర సంవత్సరాలుగా భర్తతో డేటింగ్ చేస్తున్న ఓ మహిళను.. ఎవరైనా కూతురుగా ఎలా భావిస్తారు" అనేసింది జరీనా. అసలు తనను సాయం కోరినట్లుగా కంగనా చెబుతున్న మాటలు అన్నీ అబద్ధాలే అని తేల్చేసింది. అయితే.. ఆమెతో పలు మార్లు కలిసిన మాట వాస్తవమే అని.. తన భర్త ఆదిత్య.. కంగనాను సంజయ్ లీలా భన్సాలీకి పరిచయం చేయాలని సూచించారని చెప్పింది జరీనా. అయితే.. ఈ ఎపిసోడ్ అంతా జరిగిపోయి 14-15 ఏళ్లు గడిచిపోగా.. ఇప్పుడు సరిగ్గా తన కొత్త సినిమా సిమ్రన్ విడుదలకు ముందు వివాదాలు సృష్టించడం వెనుక.. కంగనా అంతరార్ధం ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేసింది జరీనా వాహబ్.

అయితే.. జరీనా వాహబ్ ఇచ్చిన వివరణపై.. కంగన సోదరి రంగోలి రియాక్ట్ అయింది. "పెద్ద దర్శకుల దగ్గరకు కంగనాను జరీనా ఎందుకు తీసుకెళ్లాలని భావించింది.. అప్పటికే తన కూతురు కంటే చిన్నదైన ఓ మైనర్ అమ్మాయి అయిన కంగనాను.. తన భర్తే ఉపయోగించుకుంటున్నాడని తెలిసినపుడు.. ఏం చేసింది.. అసలు జరీనా.. ఆదిత్యాలను జైల్లో పెట్టాలి" అంటోంది కంగనా సోదరి.