Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఇటు చూశారో కొంప కొల్లేరే!

By:  Tupaki Desk   |   13 Aug 2018 1:30 AM GMT
ఫోటో స్టోరీ: ఇటు చూశారో కొంప కొల్లేరే!
X
పీసీకి ఎక్కే మాల్‌ వేర్‌ లా.. ఫైల్స్ అన్నీ న‌మిలేసే వైర‌స్‌ లా.. యూత్‌ కి మెద‌డు తొలుచు పురుగులా.. ఈ అమ్మ‌డు చాలా ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తోంది. యువ‌త‌రం సెక‌న్ల మీద వాట్సాప్‌ లు - సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసేందుకు ఆస్కారం ఉన్న ఆ ఫిగ‌రు - ప‌ర్స‌నాలిటీ చాలా తేడాగా క‌నిపిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న మ‌గువ ఎవ‌ర‌ని ఆరా తీస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.

పోర్నోగ్ర‌ఫీ వెబ్‌ సైట్ ల‌లో త‌ల‌దూర్చేవారికి.. ఆన్‌ లైన్ గూగుల్‌ లో ఎక్స్‌ వీడియోస్ చూసేవాళ్ల‌కు సెర్బియా నుంచి అపుడో ఎపుడో క‌చ్ఛితంగా ఫోన్ వ‌చ్చే ఉంటుంది. ఆ ఫోన్ ఈ అమ్మ‌డిదే అయి ఉండొచ్చు. పేరు జ‌క్లిన్ బెర్రిడో పిసానో.. గోముగా ప‌ల‌క‌రిస్తూ హాట్‌ గా పిలిచింద‌ని ప్ర‌తిసారీ ఫోన్ లిఫ్ట్ చేస్తే త‌స్మాత్ జాగ్ర‌త్త. మీ ఫోన్‌ లోకి వైర‌స్ .. మాల్‌ వేర్ వ‌చ్చి ఉండొచ్చు. అటుపై మీ ఫోన్ స్క్రీన్‌ పై ఉన్న బ్యాంకింగ్‌ యాప్‌ ల‌న్నిటా సెర్బియా చీటింగ్ గ్యాంగ్ వ‌ల వేసి ఉండొచ్చు.

ఇదిగో ఈ ఫోజు చూశాక .. ఆ మోడ‌ల్‌ ని చూశాక ఇలాంటి ఎన్నో సందేహాలు క‌ల‌గొచ్చు. మ‌రీ అక్కడ అలా బీచ్ సొగ‌సుల్లో అందాల ఆరబోతలో అంత తీరిగ్గా కూచునే టైమ్ ఎవ‌రికి దొరుకుతుందో ఆమాత్రం ఊహించ‌లేమా? న‌ట్ట‌న‌డి సంద్రంలో చిక్కిన నావ‌లో అంత తీరిగ్గానా? అస‌లు ఈ లోకం ఏమైతే నాకేంటి? ఎవ‌రెలా పోతే నాకేంటి? అన్న టైపులో ఈ అమ్మ‌డి వాల‌క‌మే తేడాగా ఉంది. హారిస‌న్ ఫోర్డ్ సినిమాలో హ్యాటు కింద చిక్కిన ఈ చ‌కోరి ప‌క్షిలా ఉంది. జ‌క్లిన్ అన్న‌ పేరు మోడ్ర‌న్‌ గా ఉంది క‌దా.. వ‌య‌సెంతో తెలుసుకోవాల‌నిపించిందా? వ‌య‌సెంతో తెలిస్తే క‌రెంటు తీగ‌కు చిక్క‌న కోడిపిల్ల‌లా షాక్ తింటారు. జ‌స్ట్ అర్థ‌సెంచ‌రీ కొట్ట‌డానికి రెండేళ్లు మాత్ర‌మే పెండింగ్‌.