Begin typing your search above and press return to search.

దంగల్ బేబీని భయ్యా అనేసాడట

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:30 PM GMT
దంగల్ బేబీని భయ్యా అనేసాడట
X
భారతదేశ బాక్స్ ఆఫీస్ ని కుదిపిన చిత్రం దంగల్. అమీర్ ఖాన్ సాహసోపేతమైన పాత్రను చేసి కలకాలం గుర్తిండిపోయే సినిమాను అందించారు. దేశ విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా చైనాలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. అంతే కాకుండా చైనా అధ్యక్షుడు కూడా ఈ సినిమాని స్పెషల్ షో వేయించుకొని మరీ చూశాడు. అనంతరం సినిమాలో నటించిన వారి గురించి గొప్పగా పొగిడారు.

ముఖ్యంగా అమీర్ ఖాన్ స్థాయిలో గుర్తింపు అందుకుంది జైరా వశిం. చిత్రంలో ఆమె ప్రముఖ రెజ్లర్ గీతా ఫొగాట్ చిన్నప్పటి పాత్రలో నటించింది. చేసింది చిన్న పాత్రే అయినా మంచి ప్రశంసలను అందుకొని తొలి చిత్రం తోనే నేషనల్ అవార్డు దక్కించుకుంది. అయితే మళ్లీ అదే తరహాలో మరో సరికొత్త చిత్రంతో అమీర్ ఖాన్ తో స్క్రిన్ షేర్ చేసుకుంది. అమీర్ ఖాన్ స్పెషల్ రోల్ లో జైరా వశిం లీడ్ రోల్ నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే సినిమా రీసెంట్ గా విడుదలైంది. సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా.. ముఖ్యంగా జైరా మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దంగల్ తర్వాత తనకు ఎదురైన ఒక ఫన్నీ మూమెంట్ గురించి నవ్వుతు చెప్పుకుంది.

జైరా మాట్లాడుతూ.. దంగల్ సినిమా కోసం హెయిర్ కట్ చేసుకున్నప్పుడు సినిమా విడుదల తర్వాత..ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి. భయ్యా.. మీరు దంగల్ సినిమాలో నటించారు కదా?.. ఒక సెల్ఫీ ఇవ్వరా అని అడగగానే నవ్వు ఆపుకోలేకపోయాను. అయితే అతనికి నేను అబ్బాయి కాదు అని కూడా చెప్పలేదని ఈ దంగల్ బేబీ వివరించింది. ఇక నేను భవిష్యత్తులో బిజీ అవుతానో లేదో నాకు తెలియదు. కాని వచ్చిన సినిమాల్లో శ్రద్ధగా నటించడం గురించి మాత్రమే ఆలోచిస్తానని జైరా తెలిపింది.