Begin typing your search above and press return to search.

యాక్ట్రెస్ తో క్రికెటర్ నిశ్చితార్ధం

By:  Tupaki Desk   |   24 May 2017 11:24 AM GMT
యాక్ట్రెస్ తో క్రికెటర్ నిశ్చితార్ధం
X
బాలీవుడ్ లో బోలెడన్ని ప్రేమకథలు నడుస్తూనే ఉంటాయి. సినిమా ప్రచారాలకు కూడా ప్రేమకథలు సృష్టిస్తూ ఉండడంతో.. అసలు ఏది నిజమో ఏది ప్రచారం కోసం పుట్టించిన ప్రేమో ఒక్కోసారి అర్ధం. అయితే, వీటన్నిటిీ విభిన్నంగా ఓ లవ్ స్టోరీ మాత్రం కొనసాగుతోంది.

అదే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ- బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల ప్రేమ కథ. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ నిశ్చితార్ధానికి చెట్టా పట్టాలు వేసుకుని విచ్చేశారు.. చేతిలో చెయ్యి వేసుకుని మరీ నడిచివచ్చారు. ఇంతకీ ఈ నిశ్చితార్ధం ఎవరిదో కాదు.. ఇండియన్ పేసర్ జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్. బాలీవుడ్ నటి సాగరికా ఘట్‌గేతో జహీర్ ఖాన్ నిశ్చితార్ధం జరిగింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఈవెంట్ కు పలువురు సినిమా సెలబ్రిటీలు.. స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. వీరిలో అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు.

గతేడాది జరిగిన యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ల పెళ్లి రిసెప్షన్ వేడుకలో కూడా విరాట్-అనుష్కలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జహీర్ - సాగరిక ఎంగేజ్మెంట్ కు విరాట్ తో పాటు సచిన్ టెండూల్కర్- భార్య అంజలి.. యువరాజ్ సింగ్.. రవీనా టాండన్.. రోహిత్ శర్మ- భార్య రితి.. మందిరా బేడీ.. ప్రాచీ దేశాయ్ లు అటెండ్ అయ్యారు.