Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వెబ్ సిరీస్ లు జోరందుకున్నాయి

By:  Tupaki Desk   |   20 Nov 2018 11:57 AM GMT
టాలీవుడ్ వెబ్ సిరీస్ లు జోరందుకున్నాయి
X
సినిమాల్లో అవకాశాలు ఉన్నా లేకపోయినా ఆర్టిస్టులకు వెబ్ సిరీస్ లు కొత్త గమ్య స్థానంగా కనిపిస్తున్నాయి. హిందిలో ఇప్పటికే ఈ ట్రెండ్ ఊపందుకోగా తెలుగులో సైతం క్రమంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో ఇవి ప్రవేశ పెట్టిన ఘనత అమెజాన్ ప్రైమ్ కే దక్కుతుంది. ఇప్పటి దాకా హింది లో తీసి మిగిలిన బాషలలో డబ్బింగ్ రూపంలో వదిలిన అమెజాన్ తెలుగులో స్ట్రెయిట్ గా జగపతి బాబు కీలక పాత్రలో గ్యాంగ్ స్టార్స్ తీసింది. ఈ ట్రెండ్ ని స్పూర్తిగా తీసుకుని మిగిలిన సంస్థలు కూడా అదే దారి పడుతున్నాయి.

ముఖ్యంగా జీ ఫైవ్ ఇందులో దూకుడుగా సాగుతోంది. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ రచనలో ఇటీవలే విడుదల చేసిన బిటెక్ సిరీస్ యూత్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇది నిర్మాణంలో ఉండగానే జీ ఫైవ్ మరికొన్ని సిరీస్ లకు శ్రీకారం చుట్టింది. అందులో కొన్ని త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. మంచు లక్ష్మి-అవసరాల శ్రీనివాస్ కాంబోలో మిసెస్ సుబ్బలక్ష్మి ఇందులో ముందు వరసలో ఉంది. దొంగాట-కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల ద్వార ఎంటర్ టైన్మెంట్ ను బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్న వంశీ దీనికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అక్కినేని అమలతో పాటు బ్రహ్మాజీ కూడా ఇతర కీలక పాత్రలో కనిపిస్తారు.

దీంతో పాటు ఎక్కడికి ఈ పరుగు అనే మరో సిరీస్ కూడా రెడీ చేయబోతున్నారు. రామ్ చరణ్ వినయ విధేయ రామ ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఆర్యన్ రాజేష్ తో పాటు శశాంక్ కీలక పాత్రలో నటిస్తారు. ఇవన్ని జీ బ్యానర్ లోనే రూపొందుతాయి. మొత్తానికి దూకుడు విషయంలో జీ ఫైవ్ అందరి కంటే ముందున్న మాట వాస్తవం. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటంతో పాటు అమ్మకం ధియేటర్ల అందుబాటు ఈ తలనేప్పులు ఏవి లేకుండా ఆన్ లైన్ లో రిలీజ్ చేసుకోవడమే కాబట్టి సంస్థలు దీని వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇదో కొత్త భవిష్యత్తు అనే చెప్పాలి.