టెన్నిస్ భామను తెగ తిడుతున్నారే!

Wed Dec 13 2017 09:37:50 GMT+0530 (IST)

ఆటకు అందం కూడా జత చేస్తే.. అచ్చు సానియా మీర్జాలా ఉంటుందని చెప్పేయవచ్చు. ఒకవైపు టెన్నిస్ ఆట.. మరోవైపు ఆకట్టుకునే అందంతో చూడముచ్చటగా ఉండే ఈ సుందరికి ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే.. గ్రౌండ్ బయట కూడా సానియా దూకుడుగానే ఉంటుంది.ఈమె టెన్నిస్ ప్లేయర్ అయినా.. క్రికెట్ ప్లేయర్స్ తో కూడా తెగ సన్నిహితంగా ఉంటుంది ఈ బ్యూటీ. డిసెంబర్ 12న యువరాస్ సింగ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. గతేడాది హీరోయిన్ హాజెల్ కీచ్ ను పెళ్లి చేసుకున్న యూవీ.. ఈ బర్త్ డేకి కూడా గ్రాండ్ బాష్ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి సానియా మీర్జా కూడా హాజరు అయింది. ఈ సమయంలో యువరాజ్ జంటతో కలిసి ఓ సెల్ఫీ కూడా దిగేసింది. యూవీ స్పెషల్ గా తీసిన ఈ ఫోటోను.. తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది సానియా మీర్జా.  'హ్యాపీ వాలా బర్త్ డే మోటూ.. మొత్తానికి నువ్వు కూడా ఎదుగుతున్నావ్' అంటూ కామెంట్ కూడా పెట్టింది.

అయితే.. ఈ ఫోటోలో సానియా మీర్జా క్లీవేజ్ కూడా కనిపిస్తోంది. ఇలాంటి ఫోటోను పోస్ట్ చేస్తావా అంటూ కొందరు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. అందాల ప్రదర్శన చేసేందుకు సిగ్గులేదా అంటూ తెగ తిట్టిపోస్తున్నారు. అఫ్ కోర్స్.. ఇలాంటి వాటిని గతంలో చాలాసార్లు ఆమె ఫేస్ చేసింది కాబట్టి.. ఇప్పుడు కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.