Begin typing your search above and press return to search.

షార్ట్ ఫిలిం మేకర్స్ కి భలే ఛాన్స్

By:  Tupaki Desk   |   1 Dec 2015 9:16 AM GMT
షార్ట్ ఫిలిం మేకర్స్ కి భలే ఛాన్స్
X
షార్ట్ ఫిలిమే కదా అని తక్కువగా చూసే రోజులు పోయాయి. ‘రన్ రాజా రన్’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం సంపాదించిన సుజీత్ షార్ట్ ఫిలిమ్స్ తోనే పేరు తెచ్చుకున్నాడు. డైరెక్టరయ్యాడు. ‘పిజ్జా’ లాంటి పాథ్ బ్రేకింగ్ మూవీ తీసిన కార్తీక్ సుబ్బరాజ్ కూడా షార్ట్ ఫిలిమ్స్ తో టాలెంట్ నిరూపించుకున్నాకే ఫీచర్ ఫిలిం డైరెక్టర్ అయ్యాుడు. ఇలాంటి టాలెంటెడ్ షార్ట్ ఫిలిం మేకర్స్ ఇంకా చాలామందే ఉండొచ్చు. అలాంటి వారికి ఈ మధ్య తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశాలు చాలానే వస్తున్నాయి. తెలుగులో షార్ట్ ఫిలిం పోటీలు పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి.

తాజాగా వివిధ వార్తా ఛానెళ్లను ఒకే వెబ్ సైట్ ద్వారా చూపించే ‘యప్ టీవీ’ కూడా ఓ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. డిసెంబరు 11 లోపు ఎవరైనా తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్ పంపొచ్చు. లఘుచిత్రాలు ఏ భాషలోనైనా రూపొందించవచ్చు. అయితే ప్రాంతీయ భాషల్లో తీసినప్పుడు మాత్రం వాటికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ చిత్రాలను పరిశీలించే జ్యూరీ ప్యానెల్లో అనురాగ్ కశ్యప్ - కేతన్ మెహతా - సుదీర్ మిశ్రా లాంటి ప్రముఖులుండటం విశేషం. బెస్ట్ షార్ట్ ఫిలింకి రూ.5 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన టాప్-20 బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ ను అందులో ప్రదర్శిస్తారు.