Begin typing your search above and press return to search.

యూట్యూబ్ వ్యూస్.. ఫేక్ రికార్డ్స్?

By:  Tupaki Desk   |   7 Jun 2017 10:23 AM GMT
యూట్యూబ్ వ్యూస్.. ఫేక్ రికార్డ్స్?
X
ఒకప్పుడు తెలుగు సినిమా టీజర్ దేనికైనా పది లక్షల వ్యూస్ వస్తే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్లు. 2 మిలియన్ వ్యూస్ అంటే ఇక ప్రచారం మామూలగా ఉండేది కాదు. కానీ ఈ మధ్య అల్లాటప్పా సినిమాలకు సంబంధించిన టీజర్లు.. ట్రైలర్లు కూడా మిలియన్ మార్కును ఈజీగా అందుకుంటున్నాయి. అందుకు పెద్దగా సమయం కూడా పట్టట్లేదు. పెద్ద సినిమాల టీజర్లు.. ట్రైలర్లు వస్తే గంటల్లోనే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. రోజు గడిచేసరికి యూట్యూబ్ లో ఐదారు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. మొదట ఇది జియో పుణ్యమే అనుకున్నారంతా. జియో ఫ్రీ ఇంటర్నెట్ వల్ల స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడూ యూట్యూబ్ లో క్లిక్కుల మీద క్లిక్కులు కొట్టేస్తున్నాడు కాబట్టే వ్యూస్ పెరిగాయన్న అంచనాకు వచ్చారు జనాలు.

ఐతే ఈ వ్యూస్ విషయంలో కేవలం జియో పాత్ర మాత్రమే లేదని.. ఇందులో మానుపులేషన్లు కూడా ఉంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో వ్యూస్ పెరిగేలా మేనేజ్ చేసి రికార్డులు కట్టబట్టే టీమ్స్ కొన్ని పని చేస్తున్నాయట ప్రస్తుతం. ప్రధానంగా తెలుగు.. తమిళ సినిమాలకు సంబంధించి ఈ పనులు చేసిపెట్టే టీమ్స్ సౌత్ ఇండియాలో చాలానే ఉన్నాయట. కేవలం ఫ్రీ ఇంటర్నెట్ విప్లవం వల్లే వ్యూస్ పెరిగేట్లయితే.. హిందీ సినిమాల టీజర్లు.. ట్రైలర్లకు అనూహ్యమైన స్థాయిలో వ్యూస్ రావాలి. కానీ వాటికి వ్యూస్ ఓ మోస్తరుగానే పెరిగాయి. కానీ తెలుగు టీజర్లు.. ట్రైలర్లు.. ఇతర వీడియోలకు సంబంధించి వ్యూస్ అబ్ నార్మల్ గా ఉంటున్నాయి. పనికి రాని సినిమాలకు సంబంధించిన టీజర్.. ట్రైలర్లకూ భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలు వచ్చాయంటే రికార్డుల మోత మోగిపోతోంది. ఆ లెక్కలు చూసి జనాలకు కళ్లు తిరుగుతున్నాయి. ఈ రికార్డులు నిజమైనవి కావని.. ఫేక్ అని.. ఊరికే డబ్బులిచ్చి ప్రచారం కోసం మానుపులేషన్ చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్.. ఫేస్ బుక్ లాంటి ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాల గురించి ఊకదంపుడు ప్రచారం చేసేందుకు కూడా కొన్ని గ్యాంగులు పని చేస్తున్నాయి. డబ్బులు పుచ్చుకుని బాకా ఊదేందుకు ఈ గ్యాంగులు ఎప్పుడూ రెడీగా ఉంటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/