Begin typing your search above and press return to search.

రానా ఇంట్లో స్టార్ల రచ్చ

By:  Tupaki Desk   |   15 Dec 2018 12:22 PM GMT
రానా ఇంట్లో స్టార్ల రచ్చ
X
హీరోగా పరిశ్రమకు పరిచయమైనా విలన్ గా రాణిస్తూనే విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్న దగ్గుబాటి రానా మరోపక్క ఫుల్ టైం నిర్మాతగా మారేందుకు ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలం విషయంలో రానా తీసుకున్న చొరవ దాన్ని అందరికి చేరువయ్యేలా చేసింది. తన పుట్టిన రోజును సింపుల్ గా ఇంట్లోనే సెలెబ్రేట్ చేసుకున్న రానా తనకు బాగా సన్నిహితులైన బెస్ట్ ఫ్రెండ్స్ ని పిలిచి రచ్చ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి ఇంటర్వ్యూలో ముఖ్యంగా తనతో రామ్ చరణ్ కున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే రానా ఈ వేడుకలో తననే హై లైట్ చేసాడు. అంతే కాదు అక్కినేని ఫామిలీ నుంచి అఖిల్ స్పోర్ట్స్ నుంచి సానియా మిర్జా ఇలా స్పెషల్ గెస్టులు బాగానే వచ్చారు. ఎవరికి వారు బిజీగా ఉన్నా రానా కోసం ప్రత్యేకంగా టైం కేటాయించుకుని మరీ రావడం విశేషమే. రానా ప్రస్తుతం అటు బుల్లితెరపై నెంబర్ వన్ యారి షోతో ఇటు సినిమాల షూటింగ్ లతో యమా బిజీగా ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందులో భాగంగా నిన్న విడుదలైన ఒడియన్ తనే తీసుకున్నాడు కానీ అది ఆశించిన ఫలితం ఇచ్చే దిశగా వెళ్లడం లేదు. హతీ మేరె సాథీతో పాటు తమిళ్ లో ఓ చారిత్రాత్మక సినిమా చేస్తున్న రానా ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడుగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఏదైతేనేం బాహుబలి తర్వాత తన కెరీర్ స్పీడ్ అమాంతం పెంచేసిన రానా బాబాయ్ వెంకటేష్ లాగా డిఫరెంట్ రోల్స్ వైపు మొగ్గు చూపుతూ కెరీర్ ని కొత్తగా తీర్చిదిద్దుకుంటున్నాడు