కుర్రాళ్లు కుమ్మేస్తున్నారుగా

Mon Jun 05 2017 12:07:42 GMT+0530 (IST)

ఈ ఏడాది బాహుబలి2 లాంటి భారీ సక్సెస్ లు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ హిట్ లు.. కెరీర్ బెస్ట్ లు బాగానే నమోదవుతున్నాయి. ఖైదీ నంబర్ 150 అంటూ రీ ఎంట్రీ తోనే ఇండస్ట్రీలో తన స్థాయి ఏంటో చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. పొంగల్ కే వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీతో నందమూరి బాలకృష్ణ.. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశారు.

ఒకవైపు స్టార్ హీరోలు సత్తా చూపుతున్న సమయంలోనే.. మరోవైపు కుర్రాళ్లు కూడా కుమ్మేస్తున్నారు. పొంగల్ హంగామా తర్వాత నేను లోకల్ అంటూ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు నాని. తన కెరీర్ లో అతి పెద్ద హిట్ సాధించేశాడు. ఆ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు రా రండోయ్ వేడుక చూద్దాం అంటూ సూపర్ హిట్ సాధించాడు అక్కినేని నాగ చైతన్య. మొదటి వారం ముగిసేనాటికే ఈ మూవీ 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందంటే.. ఏ రేంజ్ హిట్ అనే విషయం అని అర్ధమవుతుంది. నిఖిల్ నటించి కేశవ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురించింది.

 కుర్రాళ్లు సత్తా చూపే ట్రెండ్ ను ఇప్పుడు రాజ్ తరుణ్ కంటిన్యూ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన అంధగాడుకు టాక్ అటూఇటూగా ఉన్నా.. తొలి రోజునే  ఈ మూవీకి 3.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైందంటే.. అందుకు రాజ్ తరుణ్ ప్రధాన కారణంగా చెప్పచ్చు. ప్రస్తుతం చిన్న సినిమాలకు జనాల నుంచి లభిస్తున్న సపోర్ట్ ను చూస్తే.. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు బోలెడంత జోష్ వచ్చేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/