ఆ స్టార్ కిడ్ తో డేటింగ్ పై కుర్ర హీరో స్పందన

Tue Jun 11 2019 15:11:17 GMT+0530 (IST)

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలి ఈమద్య కాలంలో మీడియాలో ఎక్కువగా ఉంటోంది. ఈమె ప్రేమ విషయం గురించి బాలీవుడ్ వర్గాల్లో పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నవ్య ఈమద్య కాలంలో ఎక్కువగా పార్టీలంటూ తిరుగుతూ జాతీయ మీడియాకు చిక్కుతోంది. ఇక ఈమె బాలీవుడ్ నటుడు జావేద్ జాఫెరి తనయుడు మీజాన్ తో ప్రేమలో ఉన్నట్లుగా ఈమద్య కాలంలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో పాటు పార్టీలంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.మీజాన్ హీరోగా 'మలాల్' తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ బ్యానర్ నుండి రాబోతున్న మలాల్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి సినిమానే బిగ్ ఫిల్మ్ మేకర్ బ్యానర్ లో చేస్తున్న మీజాన్ కు మంచి భవిష్యత్తు ఉంది అంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జులైలో విడుదల కాబోతున్న మలాల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మీజాన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి నవ్య గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

నవ్య చా చెల్లికి బెస్ట్ ఫ్రెండ్. వారు తరుచు కలుస్తూ ఉండే వారు. అలా నవ్య నాకు కూడా మంచి స్నేహితురాలు అయ్యింది. ఇద్దరం మంచి స్నేహితులుగా మాత్రమే మెలుగుతాం తప్ప అంతకు మించి ఏమీ లేదు. మా ఇద్దరి మద్య విషయాన్ని మీడియా రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తుందని మీజాన్ అన్నాడు. ప్రస్తుతానికి నేను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేను. ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు.. సినిమాల్లో గుర్తింపు దక్కించుకోవడేమ నా ముందున్న లక్ష్యం అన్నట్లుగా మీజాన్ పేర్కొన్నాడు.