Begin typing your search above and press return to search.

టెన్షన్ తెప్పిస్తున్న కొత్త కుర్రాడు

By:  Tupaki Desk   |   16 Aug 2017 4:20 AM GMT
టెన్షన్ తెప్పిస్తున్న కొత్త కుర్రాడు
X
గతేడాది విడుదలైన ఓ చిన్న సినిమాతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు ఓ కొత్త కుర్రాడు. దీంతో ఆ కొత్త హీరోకి ఆఫర్లు క్యూ కట్టాయి. వరుస సినిమాలు చేయడంతో పాటు మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యాడు. తన సినిమా ఫంక్షన్స్ లో చాలా బోల్డ్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో కావాల్సినంత ప్రచారం తెచ్చుకుంటున్నాడు. ఇంతవరుకు బాగానే అయితే తన మొదటి సినిమా రిలీజై సక్సెస్ ఊపులో ఉండగా తన తదుపరి సినిమా ఇదేనంటూ ఓ టీజర్ విడుదల చేయించాడు ఆ కుర్ర హీరో. ఓ వర్గానికి చెందిన పేరును ఆ సినిమాకి టైటిల్ గా పెట్టించాడు.

దీంతో ఆ వర్గానికి చెందిన సినీజనాలే కాకుండా, చాలా మంది ఏ క్లాస్ ఆడియెన్స్ కు ఆ సినిమా టీజర్ తెగ నచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా విడుదల అవుతుందని అంతా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే జనాల్ని ఆకట్టుకున్న ఆ టీజర్ డిస్ట్రీబ్యూటర్లని - బిజినెస్ వర్గాల్ని పెద్దగా ఆకట్టుకోలేదని తెలిసింది. దీంతో ఆ సినిమాకి సరైన బిజినెస్ దొరక్క ఓ సంవత్సరం నుంచి విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇటీవల త్వరలోనే విడుదల చేస్తామంటూ ఆ చిత్ర ఓ డేట్ ఎనౌన్స్ చేసినప్పటికి, మళ్లీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వచ్చనే టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాను చూసిన ఓ స్టార్ హీరో - సినిమాను పక్కనపెట్టేసి అందులో యాక్ట్ చేసిన ఆ కుర్ర హీరో గురించి టెన్షన్ పడుతున్నాడట. ఇలాంటి కథలు ఎంచుకోవడానికి చాలా గట్స్ కావాలంటూ, ఆ కుర్ర హీరోని ఇలానే వదిలిస్తే ఏదో రోజున తనకు చెక్ పెడతాడని తన సన్నిహితుల దగ్గర పలు మార్లు ఆ స్టార్ హీరో ప్రస్తావించడానే న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో తెగ వినిపిస్తుంది. మరి స్టార్ హీరోకే టెన్షన్ తెప్పించిన ఆ కొత్త కుర్రాడు రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.