Begin typing your search above and press return to search.

త‌న పెళ్లిపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:06 PM GMT
త‌న పెళ్లిపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్‌!
X

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్టార్ మా చానెల్ లో ప్ర‌సారమ‌వుతోన్న ‘నీతోనే డ్యాన్స్ షో’కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త వారం షోలో ఓ జంట బ‌ద్రి సినిమాలో పాట‌కు చేసిన ప‌ర్ ఫార్మ‌న్స్ పై రేణు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారిలో 10 శాతం కూడా చేయ‌లేదంటూ వారిని నిరుత్సాహ‌ప‌రిచింది. రేణు కామెంట్ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా, ఈ షోలో రేణు త‌న పెళ్లి గురించి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసింది. ఓ జంట ప‌ర్ ఫార్మ‌న్స్ ను చూశాక త‌న‌కు ప్రేమ‌పై ప్రేమ పుట్టింద‌ని చెప్పింది. అంతేకాకుండా, భ‌విష్య‌త్తులో తాను పెళ్లి చేసుకుంటే ఆ జంట‌ను త‌ప్ప‌క ఆహ్వానిస్తాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. వ‌చ్చే శ‌ని - ఆదివారాల్లో ప్ర‌సారం కాబోతోన్న‌ ఈ షో ప్రొమోను 'స్టార్ మా' త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఉంచింది. రేణు దేశాయ్ ప్రేమ‌తో ప్రేమ‌లో ప‌డింది....అంటూ ఆ వీడియోతో పాటు ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ అయింది.

ఆ షోలో ఓ జంట చేసిన డ్యాన్స్ ప‌ర్ ఫార్మ‌న్స్ పై రేణూ దేశాయ్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఆ సంద‌ర్భంగా రేణు ఎమోష‌న‌ల్ అయి కంట‌త‌డి పెట్టింది. ‘నాకు ప్రేమ మీద కొంచెం నమ్మకం పోయింది...కానీ మీ అనుబంధం చూసిన తర్వాత ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.... నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటానో అప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా ఆహ్వానిస్తా’ అని రేణూ క‌న్నీరు పెట్టుకుంటూ ఆ జంట‌ను అభినందించింది. రేణు వ్యాఖ్య‌లు చేసిన ఆ ప్రోమోను చూసి నెటిజ‌న్లు కూడా ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రోవైపు, కొంతకాలం క్రితం తాను అనారోగ్యంతో ఉన్న‌పుడు రాత్రి స‌మ‌యాల్లో త‌న అక్క వ‌చ్చి ఆసుప‌త్రికి తీసుకెళ్లాల్సి వ‌చ్చింద‌ని, ఆ స‌మ‌యంలో ఎవ‌రైనా తోడు ఉంటే బాగుంటుంద‌ని అనిపించిందిన ఓ ఇంట‌ర్వ్యూలో రేణు చెప్పిన సంగ‌తి తెలిసిందే. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటానేమో అన్న ఉద్దేశంలో రేణూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ అభిమానులు మండిప‌డ్డారు. అయితే, తాను అంద‌రు మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ఆ కామెంట్ చేశాన‌ని రేణు వివ‌ర‌ణ ఇచ్చింది. ఇపుడు తాజాగా, త‌న పెళ్లిపై రేణు చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మ‌రి.