Begin typing your search above and press return to search.

చెర్రీ-సామ్ ఎంత సక్కగున్నారో!!

By:  Tupaki Desk   |   23 March 2018 1:03 PM GMT
చెర్రీ-సామ్ ఎంత సక్కగున్నారో!!
X
రంగస్థలం.. ఇప్పుడు టోటల్ తెలుగు జనాలు అంతా ఫుల్లుగా ఈ సినిమా చుట్టే తిరిగేస్తున్నారు. వేరే సినిమాల సంగతులు కూడా మధ్యమధ్యలో హల్ చల్ చేస్తున్నాయి కానీ.. మరో వారంలో రిలీజ్ కానున్న రామ్ చరణ్ మూవీపై జనాల్లో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. జనాల అటెన్షన్ ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్లడంపై పక్కా ప్లానింగ్ తో ఉన్న రంగస్థలం మూవీ టీం.. తమ ఐడియాలను సక్సెస్ ఫుల్ గా అప్లై చేస్తున్నారు.

విపరీతంగా ట్రెండింగ్ అయిపోయి.. ఛార్ట్ బస్టర్ గా నిలిచిన ఎంత సక్కగున్నావే పాటకు ఇప్పుడు సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఓ తాటాకు విసినకర్రతో విసురుకుంటూ నడవడంతో మొదలైన ఈ పాట.. లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఓ విజువల్ వండర్ లా అనిపిస్తుంది. పల్లెటూరి నేటివిటినీ ఎంతో అందంగా.. అందులోనూ 30 ఏళ్ల క్రితం నాటి పల్లెటూరి అలవాట్లు.. అందాలను చూపించిన తీరు అద్భుతం అనాల్సిందే. హీరోయిన్ గురించి వర్ణించుకుంటూ హీరో పాట పాడుకోవడం.. గేదెలను చెరువులో కడుగుతున్న సమంత.. ఇత్తడి చెంబులో నీళ్లు తాగుతున్న సీన్.. గోదారి గట్టున చెర్రీ చిందులు.. మొక్కజొన్న పొత్తు ఒలుస్తున్న హీరోయిన్.. చాలానే డీటైలింగ్ కనిపిస్తుంది.

ఈ కాలపు జనాలు.. ముఖ్యంగా అర్బన్ ఆడియన్స్ లో చాలామందికి తెలియని ఎన్నో సీన్స్ ను ఒక ప్రోమోలోనే చూపించాడు దర్శకుడు సుకుమార్. ఇక సినిమాలో ఎన్ని చిత్రాలు చూపించనున్నాడో చూడాలి. ఎంత సక్కగున్నావే సాంగ్ ప్రోమో పూర్తయ్యే సరికి ఈ జంట ఎంత సక్కగున్నారో అని ఎవరైనా అనుకోవాల్సిందే.



వీడియో చూడటానికి క్లిక్ చేయండి