Begin typing your search above and press return to search.

'యాత్ర' మరీ అంత తక్కువగానా?

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:57 AM GMT
యాత్ర మరీ అంత తక్కువగానా?
X
బయోపిక్‌ లకు తెలుగులో మంచి ఆధరణ లభిస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహానటి' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఆకట్టుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ 'యాత్ర' కూడా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. తాజాగా ఎడిటింగ్‌ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఎడిటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం నిడివి 1 గంట 57 నిమిషాలుగా నిర్ణయించారు.

ఈమద్య కాలంలో సినిమాలు ఎక్కువగా రెండు గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంటున్నాయి. అయితే పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాలు మాత్రం రెండున్నర గంటలు ఉంటున్నాయి. కొన్ని మూడు గంటలకు కాస్త తక్కువ కూడా ఉంటున్నాయి. కాని యాత్ర సినిమా మాత్రం రెండు గంటలకు తక్కువగా ఉండటం కాస్త ఆశ్చర్యంకు గురి చేస్తుంది. బయోపిక్‌ అంటే చాలా మ్యాటర్‌ ఉంటుంది. మరి రెండు గంటల్లో దర్శకుడు మహి ఏం చూపించాడో చూడాలి.

ఇక ఈ చిత్రం కోసం పెంచల్‌ దాస్‌ తో ఒక పాటను రాయించారు. సినిమా ముగిసిన తర్వాత వచ్చే ఈ పాట వైఎస్‌ అభిమానులను కదిలించేలా ఉంటుందట. తప్పకుండా ఆ పాటతో ఆయన అభిమానులు కదిలి పోయి, కన్నీరు పెట్టుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. పెంచల్‌ దాస్‌ రాసి, ఆయనే ఆ పాటను ఆలపించాడట. సినిమాకు ఆ పాట ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు.