పెళ్లైన స్టార్ హీరోతో ప్రేమలో పడిందట

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

తమిళ బిగ్ బాస్ సీజన్ 2తో మంచి గుర్తింపు దక్కించుకున్న కోలీవుడ్ ముద్దుగుమ్మ యషిక ఆనంద్. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలమే అయినా కూడా బిగ్ బాస్ కారణంగా ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. వచ్చిన పేరును మరింత పెంచుకోవాలనుకుంటుందో లేదా మరేంటో కాని ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హాట్ ఫొటోలతో పాటు సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా యషిక పోస్ట్ లు ఉంటాయి.తాజాగా ఒక నెటిజన్ ఈ అమ్మడిని మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ప్రశ్నించగా యషిక సమాధానంగా... తనకు సూర్య అంటే చాలా ఇష్టం ఆయనతో ప్రేమలో ఉన్నాను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. సూర్య అంటే తనకు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో అభిమానం అంటూ యషిక పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై సూర్య అభిమానులు రెచ్చి పోయారు.

పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్న వ్యక్తి గురించి అలాగేనా మాట్లాడేది కనీస జ్ఞానం లేకుండా మరో స్త్రీ కి చెందిన వ్యక్తిని పంచుకోవాలనుంది అంటూ అందరి ముందు చెప్పడం సిగ్గు చేటు. సూర్య అభిమానుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తట్టుకోలేక తాను చేసిన ఆ కామెంట్ ను డిలీట్ చేసింది. సూర్య పై ఉన్న అభిమానంతో ఆమె అలాంటి కామెంట్ చేసి ఉంటుంది అంత మాత్రాన మరీ అంతగా యషిక ను సూర్య అభిమానులు టార్గెట్ చేయాల్సి ఉండకూడదు.