Begin typing your search above and press return to search.

ప్రభాసా? అసలు సినిమా స్ర్కిప్టే కాలేదు

By:  Tupaki Desk   |   26 Oct 2016 7:30 AM GMT
ప్రభాసా? అసలు సినిమా స్ర్కిప్టే కాలేదు
X
ప్రభాస్ చాలా కాలంగా ఒకే ప్రాజెక్టుపై పని చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ చరిత్రను తిరగరాసేసిన బాహుబలి కోసం ఇంకా వర్క్ చేస్తున్నాడు. మరో నెల రోజుల్లో బాహుబలిని పూర్తి చేసి ఇంకో ప్రాజెక్టుపై దృష్టి పెడతాడు యంగ్ రెబల్ స్టార్. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా.. సుజిత్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. అయితే.. ధూమ్ 4లో ప్రభాస్ నటించనున్నాడనే రూమర్ ఎక్కువగానే చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఒకరిద్దరు ఈ విషయాన్ని ఖండించారు కానీ.. ఇప్పుడు ధూమ్4పై ఏకంగా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచే క్లారిటీ వచ్చేసింది. 'ధూమ్4 కు ఇంకా స్క్రిప్ట్ కూడా రెడీ కాలేదు. ఇక కాస్టింగ్ సంగతులు ఎలా చూస్తాం.. ప్రభాస్ ను ఫైనల్ చేయడం ఎలా కుదురుతుంది' అనడంతో ధూమ్4 లో ప్రభాస్ ఎంట్రీపై ఓ స్పష్టత వచ్చేసినట్లే. బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రభాస్ ఉత్సాహంగా ఉన్నాడనే చెప్పాలి. ఒకటికి నాలుగు సార్లు తనకు బాలీవుడ్ ఆఫర్స్ బోలెడన్ని వచ్చాయని చెబుతూనే ఉంటాడు. కానీ ధూమ్ లాంటి ప్రాజెక్టుతో ఎంట్రీ ఇస్తే ఆ కిక్కే వేరప్పా అని చెప్పాలి.

కానీ ధూమ్ సిరీస్ లోకి ఎంట్రీ అంత తేలికేం కాదు. ప్రతీ సినిమాకి క్యాస్టింగ్ పరంగా రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. ధూమ్4 విషయంలో సల్మాన్ ఖాన్.. షారూక్ ఖాన్ లు ప్రపోజల్స్ లో ఉన్నారు. సల్మాన్ చేయనని చెప్పాడు కానీ.. షారూక్ ఖాన్ ని కాదని ప్రభాస్ వరకూ ఆ రోల్ రావడం అంటే కొంచెం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/