వర్జినిటీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Tue May 15 2018 13:05:52 GMT+0530 (IST)

ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ అడల్ట్ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ అందరిని ఆకట్టుకుంటోంది. 'ఇరుతు అరైయిల్ మురతు కుత్తు' అనే సినిమా కలెక్షన్స్ లలో దుమ్ము రేపుతోంది. ఇంతకుముందు వచ్చిన అడల్ట్ సినిమాలకంటే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉండడంతో తమిళ సినీ ప్రేక్షకులు సినిమాకు అడిక్ట్ అయిపోతున్నారు. సినిమాలో ఒక దెయ్యం వర్జిన్  అబ్బాయిలతో రొమాన్స్ చేయడం హైలెట్ గా నిలిచింది.కాన్సప్ట్ ఎదో వెరైటీ గా ఉందని యువత కూడా ఆ సినిమా చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే అందులో నటించిన ఓ ముద్దగుమ్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. యషిక ఆనంద్ అనే హీరోయిన్ ఇటీవల ఆన్ లైన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో గర్ల్స్ కన్యత్వం గురించి ఒక కామెంట్ చేసింది. దీంతో ఇంటర్నెట్ లో ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మాయిలు పెళ్లికి ముందు వర్జినిటి కోల్పోవడం సరైనదేనా? అనే ప్రశ్నకు అమ్మడు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది.

అందులో పెద్ద సందేహం ఏముంది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. కోల్పోవడంతో తప్పు కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్లది అంటూ అమ్మడు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో నెటిజన్స్ ఆమె మాటలకు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా సినిమాపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.