ట్రైలర్ టాక్: అంతా బూతే...!

Thu Sep 20 2018 16:33:28 GMT+0530 (IST)

ఇది వెబ్ సీరీస్ లు.. వెబ్ ఒరిజినల్ ఫిలిమ్స్ కాలం.  ఇక్కడ సెన్సారు ఉండదు.. బొంగూ ఉండదు.  భాష తేడా వచ్చిందని బాధపడకండి. అలాంటి బూతు కంటెంట్ గురించి రాయాలంటే ఇలాంటి ఘాటు భాష అవసరమే!  సెన్సార్ ఉన్న సినిమాలలోనే మూతులు నాక్కోవడం ఎక్కువయింది.  ఇక సెన్సార్ లేని వెబ్ సీరీస్ లో పరిస్థితి ఎలా ఉంటుంది?మీరు చూశారో లేదో తెలీదు గానీ ఇప్పటికే 'గందీ బాత్'.. 'రాగిణి MMS రిటర్న్స్' (అదే పేరుతో ఉన్న సినిమా కు కొనసాగింపుగా వెబ్ సీరీస్).. 'ట్విస్టెడ్'.. 'మాయ'.. 'ఐ లవ్ అజ్' ఇవన్నీ ఎక్స్ ప్లిసిట్ కంటెంట్ బాగా ఉన్న వెబ్ సీరీస్. ఇక మీకు 'లస్ట్ స్టోరీస్' గురించి దాదాపుగా తెలిసే ఉంటుంది. తాజాగా ఏక్తా కపూర్ ప్రొడక్షన్ అయిన బాలాజీ వారు 'XXX అన్ సెన్సార్డ్' పేరుతో కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ALT బాలాజీ అనే మరో బ్యానర్ పై దీన్ని నిర్మించారు. 'XXX అన్ సెన్సార్డ్' ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ మొత్తం బోల్డ్.. ఎరోటిక్.. సెక్స్ సీన్స్ తో నిండిపోయింది.  లాస్ట్ సీన్ లో అయితే రతిక్రీడలో పూర్తిగా మునిగి 'ఇత్నా లక్కీ హైరే తూ కుత్తే' అంటాడు.  ఇలాంటివాటిని సాఫ్ట్ బాషలో వివరించడం కష్టం కాబట్టి మీరు చూసి తరించండి. తప్పే కాదు. సిగ్గుపడాల్సిన పనే లేదు.. ఎందుకంటే  నవరసాల్లో శృంగారం ఒకటి. దయచేసి శృంగారం వేరు రతి వేరు అనే చెత్త లాజిక్ లు చెప్పి దాన్నో పెద్ద డిబేట్ గా మార్చొద్దు!  అన్నట్టు బాలయ్య 'పైసా వసూల్' సినిమాలో నటించిన కైరా దత్ ఈ సిరీస్ లో లీడ్ రోల్.. ట్రైలర్ చూస్తూ పనిలో పనిగా ఆమె అందాన్ని కూడా ఆస్వాదించండి!