Begin typing your search above and press return to search.

దీపికను అలా ఎత్తుకుంటే హాటే హాటు

By:  Tupaki Desk   |   28 July 2016 1:30 PM GMT
దీపికను అలా ఎత్తుకుంటే హాటే హాటు
X
ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాతో తన ఖ్యాతిని మరింత పెంచుకోవాలని చూస్తోంది సెక్సిణి దీపికా పదుకొనె. అమ్మడు ప్రస్తుతం ''గగగః ది రిటర్న్ ఆఫ్‌ గ్జాండర్ కేజ్'' సినిమాతో అక్కడ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్న రిలీజైన తొలి టీజర్ ట్రైలర్లో దీపికి కేవలం కళ్ళు మూస్తే మిస్అ యిపోతాం అనేంత రెప్పపాటు షాటులో కనిపించింది. అందుకే అది చూసి హర్టయిన ఆమె ఫ్యాన్సు కోసం ఇప్పుడు మేకింగ్ వీడియో ఒకటి తనే స్వయంగా విడుదల చేసింది.

ఈ సినిమా కోసం ఫిట్టుగా తయారైన దీపిక.. హాట్ కాస్ట్యూమ్స్ తో ఎలా ఆకట్టుకుంటుందో మనం ఇప్పటికే చూసిన కొన్ని ఫోటోల ద్వారా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త వీడియోలో చూస్తే.. అంత హాటుగా ఉన్న దీపికను.. చక్కగా బీచ్ లో ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నాడు హీరో విన్ డీజిల్. జాగ్రత్త బాబు.. అగ్గిపుల్ల వంటి దీపిక ముందు పెట్రోల్ డీజిల్ ఏమి నిలుస్తాయి. అసలు మేకింగ్ వీడియోలోనే ఇంక హాటుగా ఉందంటే.. ఇక సినిమాలో ఎంత సెక్సీగా తన హొయలు వలికించేసి ఉంటుందో అంటూ ఆమె అభిమానులు కూడా ఈ సెగలన్నీ చూసి ఖుషీ అయిపోతున్నారులే.

అవతల రణవీర్ సింగ్ ఏం చేస్తున్నాడు మరి? ఆ ఏముంది.. బేఫికర్‌ సినిమా కోసం మొన్నటివరకు హీరోయిన్ వాణి కపూర్ కు ముద్దులెట్టి బాగా అలసిపోయాడంట. అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు.