Begin typing your search above and press return to search.

ఎక్స్ మెన్ 8: డెడ్ పూల్ స్టోరీ ఇదే

By:  Tupaki Desk   |   12 Feb 2016 7:18 AM GMT
ఎక్స్ మెన్ 8: డెడ్ పూల్ స్టోరీ ఇదే
X
హాలీవుడ్ లో సూపర్ హీరోస్ చాలామందే ఉంటారు. కానీ ఇలాంటి సూపర్ హీరో కేరక్టర్లని కొత్తగా సృష్టించి, అన్నీ ఒక చోటకు చేర్చినదే ఎక్స్ మెన్ మూవీ. ఇందులో ఇప్పటివరకూ 7 భాగాలు రాగా.. అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడీ సిరీస్ లో ఎనిమిదో పార్ట్ గా డెడ్ పూల్ రూపొంది.. ఇవాళే రిలీజ్ అయింది.

థోర్: ది డార్క్ వరల్డ్ - ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ వంటి చిత్రాలకు క్రియేటివ్ డైరెక్టర్ గా పని చేసిన టిమ్ డైరెక్షన్ లో రూపొందిన తొలి మూవీ డెడ్ పూల్. గత ఎక్స్ మెన్ సినిమాల్లో కనిపిం వేడ్ విల్సన్ అలియాస్ డెడ్ పూల్ పాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించారు. డెడ్ పూల్ గా ర్యాన్ రెనాల్డ్స్ నటించాడు. ఓ స్పెషల్ ఆర్మీ ఫోర్స్ లో పనిచేసే వేడ్.. కాంట్రాక్ట్ సైనికుడిగా మారతాడు. ఏ మాత్రం సంకోచం లేకుండా.. అడ్డొచ్చిన అందరినీ మట్టుబెట్టేస్తూ ఉంటాడు. ఇతగాడి లైఫ్ లోకి వన్నెస్సా ఎంటర్ కావడంతో.. లైఫ్ టర్న్ తీసుకుంటుంది. వేడ్ లోనూ మార్ప్ వస్తుంది.

వేడ్ విల్సన్ కు క్యాన్సర్ ఉందని తేలడంతో.. ఆ సమయంలో చేసిన ట్రీట్ మెంట్ వికటిస్తుంది. ఓ ప్రయోగం వికటించి స్కిన్ కలర్ మారిపోతుంది. బ్రెయిన్ పై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో అతను తన శరీరానికి ఎలాంటి గాయమైనా.. క్షణాల్లో మానిపోయే శక్తి వస్తుంది. ఆ తర్వాత తన లైఫ్ పాడవడానికి కారణమైన వాళ్లపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడన్నదే డెడ్ పూల్ మూవీ క్లైమాక్స్. ఈ మూవీని 48 రోజుల్లోనే షూటింగ్ చేసేయడం విశేషం.