Begin typing your search above and press return to search.

కబాలి టీజర్.. వరల్డ్ లెవెల్లో సెకండ్

By:  Tupaki Desk   |   5 May 2016 5:30 PM GMT
కబాలి టీజర్.. వరల్డ్ లెవెల్లో సెకండ్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రభంజనం కొనసాగుతోంది. ఆయన కొత్త సినిమా ‘కబాలి’ టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటికే ఇండియన్ టీజర్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన ‘కబాలి’.. వరల్డ్ వైడ్ రికార్డుల మీదా కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్ తెచ్చుకున్న వీడియోల్లో ‘కబాలి’ది ప్రస్తుతం రెండో స్థానం కావడం విశేషం. ‘ఏవెంజర్స్’ తర్వాత అత్యధికంగా లైక్స్ కొట్టించుకున్నది ‘కబాలి’ టీజరే. దీనికి ఇప్పటిదాకా 3.4 లక్షల లైక్స్ వచ్చాయి. ఏవెంజర్స్ 5.12 లక్షల లైక్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ‘కబాలి’ టీజర్.. 3.02 లక్షల లైక్స్ తో రెండో స్థానంలో ఉన్న ‘జురాసిక్ వరల్డ్’ ను దాటేసింది.

ఇండియాలో అత్యంత వేగంగా కోటి వ్యూస్ మార్కు దాటిన టీజర్ గా ‘కబాలి’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేవలం మూడే రోజుల్లో ఈ టీజర్ ఆ ఘనత సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని రికార్డిది. ప్రస్తుతం కబాలి తమిళ టీజర్ వ్యూస్ కౌంట్ లెక్క 1.2 కోట్లకు చేరుకుంది. తెలుగు టీజర్ ఇంకో 13 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుంది.

ఇప్పటికే సౌత్ ఇండియాలో అన్ని టీజర్ల రికార్డుల్ని దాటేసిన ‘కబాలి’.. త్వరలోనే ఇండియాలో అత్యధిక హిట్స్ తెచ్చుకున్న టీజర్ గానూ రికార్డు నెలకొల్పే అవకాశముంది. నిమిషం నిడివి ఉన్న టీజర్లో రజినీ తనదైన శైలిలో మెస్మరైజ్ చేస్తూ తన అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.