ఆ హాలీవుడ్ హీరో బాహుబలికి పెద్ద ఫ్యాన్

Tue Apr 17 2018 13:10:28 GMT+0530 (IST)

బాహుబలి మన తెలుగు వాళ్లే వీర ఫ్యాన్స్ అనుకున్నాం కానీ... ప్రపంచవ్యాప్తంగా మనలాంటోళ్లు చాలా మందే ఉన్నారు. సామాన్యులే కాదు పెద్ద హాలీవుడ్ హీరోలు సైతం బాహుబలికి ఫిదా అయిపోయారు. ఒక హాలీవుడ్ హీరో బాహుబలి సినిమాపై ఉన్న ప్రేమను పబ్లిక్ గానే చాటాడు. ఐ లవ్ దీస్ మూవీస్ అంటూ తన సోషల్ ఖాతాలో బాహుబలి ఫోటోలను పెట్టాడు. ఆ సినిమాలు విడుదలై రెండేళ్లకు పైగా అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమాల ప్రభావం ఓ హాలీవుడ్ హీరోపై ఉందంటే.... చెప్పుకోవాల్సిన విషయమే కదా.హాలీవుడ్ మూవీస్ చూసే అలవాటున్న ప్రతి సినీ అభిమాని కచ్చితంగా బ్లాక్ పాంథర్ సినిమా చూసే ఉంటాడు. అందులో లీడ్ రోల్ విన్‌స్టన్ డ్యూక్.  అతగాడు ఖాళీ దొరికినప్పడల్లా బాహుబలిని తెగ చూస్తున్నాడట. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆ సినిమా క్లిప్పింగ్స్‌ను పోస్టు చేస్తూ ఆ సినిమ చూస్తున్నానని ఆ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని పోస్టులు పెట్టాడు. వాటికి వేల మంది స్పందిస్తున్నారు కూడా. ఇంతవరకు మమ్మీ జురాసిక్ పార్క్ టైటానిక్ వంటి సినిమాలను మనం పదే పదే చూసేవాళ్లం... ఇప్పుడు మన బాహుబలి సిరీస్‌ను హాలీవుడ్ వాళ్లు పదే పదే చూస్తున్నారు. ఇదంతా బాహుబలి సినిమా గొప్పతనం జక్కన్న పనితనం.

బాహుబలి ప్రభాస్ ని అంతర్జాతీయ స్టార్ ను చేసేసింది. అయిదేళ్ల పాటూ తన జీవితాన్ని ఒక సినిమాకు అంకిత మిచ్చి ప్రభాస్ మంచి ఫలితాన్ని రాబట్టుకున్నాడు. సినిమాతో పాటూ ప్రభాస్ నటనపై కూడా ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ సాహోతో బాలీవుడ్ తెరంగేట్రం ఇవ్వబోతున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది.