Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ స్టామినా తెలిసేదెప్పుడు ?

By:  Tupaki Desk   |   20 July 2019 1:30 AM GMT
వరుణ్ తేజ్ స్టామినా తెలిసేదెప్పుడు ?
X
మెగా ప్రిన్స్ గా అభిమానులు పిలుచుకునే వరుణ్ తేజ్ ఏడాది ప్రారంభంలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టినా అదేమంత కిక్ ఇవ్వలేకపోయింది. ఫలితంలో ముప్పాతిక శాతం క్రెడిట్ వెంకటేష్ తీసుకోగా మిగలిన బాలన్స్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎకౌంటులోకి వెళ్లిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే వరుణ్ తేజ్ అందులో సపోర్టింగ్ రోల్ కన్నా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న పాత్ర చేశాడు తప్ప తన భుజాల మీద మోసింది కాదు.

ఇక తన ఒక్కడినే నమ్ముకుని వచ్చిన అంతరిక్షం గురించి తెలిసిందే. ఫిదా బ్లాక్ బస్టర్ కొడితే ఎక్కువ పేరు సాయి పల్లవి కొట్టేసింది. తొలిప్రేమ విజయంలో రాశి ఖన్నా-వెంకీ అట్లూరి ఇద్దరూ కలిసి వరుణ్ తేజ్ తో సమానంగా పేరులో షేర్ తీసుకున్నారు. ఇవన్ని పరిగణనలోకి తీసుకుంటే వరుణ్ తేజ్ ఇమేజ్ మీదే లేదా యాక్టింగ్ మీదే నడిచింది ఆడింది అనే బొమ్మ ఒకటి పడాలని అభిమానులు కోరుతున్నారు

ఇక వాల్మీకి విషయానికి వస్తే వరుణ్ తేజ్ చేస్తోంది హీరో పాత్ర కాదు. నెగటివ్ షేడ్స్ ఉంటూనే హీరోతో సమానంగా సాగే విలన్ లాంటి పాత్ర. మరో హీరో ఎవరు. కోలీవుడ్ నుంచి వచ్చిన అధర్వా. అంజలి సిబిఐలో నయనతార తమ్ముడిగా రాశి ఖాన్న లవర్ గా నటించింది ఇతనే. మనవాళ్ళకు పెద్దగా పరిచయం లేదు.

ఇప్పుడీ తమిళ రీమేక్ లో వరుణ్ తేజ్ అధర్వాల పాత్రలు హరీష్ శంకర్ ఎలా డిజైన్ చేసుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. పైన చెప్పిన తరహాలోనే వాల్మీకికి సైతం సక్సెస్ షేర్ పంచుకోవాలా అనే అనుమానం వస్తోంది. ఇలా కాదు కాని తర్వాతైనా తానొక్కడే సెంట్రల్ పాయింట్ గా ఉంటూ సినిమాను నిలబెట్టే కథను ఎంచుకునే దాకా వరుణ్ తేజ్ మీద ఇలాంటి కామెంట్స్ తప్పవు