ఆ థ్రిల్లర్ రీమేక్ లో సునీల్?

Wed Jun 12 2019 11:35:25 GMT+0530 (IST)

స్టార్ కమెడియన్ గా సూపర్ పాపులారిటీ సాధించిన సునీల్ హీరోగా మారిన మొదట్లో సక్సెస్ సాధించాడు కానీ తర్వాత మాత్రం వరస ఫెయిల్యూర్లను చూడాల్సి వచ్చింది. దీంతో మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.  కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అరడజను సినిమాలు చేసినా సునీల్ కు ఇంకా చెప్పుకోదగ్గ పాత్ర అయితే పడలేదు.   అయితే ఇంకా చేతిలో మంచి ప్రాజెక్టులే ఉన్నాయి. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ఫిలిం.. రవితేజ 'డిస్కోరాజా' లో సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు.కమెడియన్ రోల్స్ సంగతి ఇలా ఉంటే హీరోగా కూడా ఒక క్రేజీ రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయట. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'అంధా ధున్' సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకునేందుకు ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని సమాచారం.  సునీల్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనతోనే నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారట. సునీల్ కూడా ఈ రిమేక్ పట్ల ఆసక్తితో ఉన్నాడట.  త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.

అయుష్మాన్ ఖురానా.. రాధిక ఆప్టే.. టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడం మాత్రమే కాదు.. చైనాలో కూడా దుమ్ము లేపింది.  థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఒక అంధుడి పాత్రలో నటించాడు.  ఇప్పుడు సునీల్ కూడా తెలుగులో అంధుడిగా నటించాల్సి ఉంటుంది.  అయితే హిందీ సినిమాలోని మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేయగలరా అనేది వేచిచూడాలి.