Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ పార్టీకి హాలీవుడ్ స్టార్ గెస్ట్

By:  Tupaki Desk   |   30 Aug 2016 11:45 AM GMT
సూపర్ స్టార్ పార్టీకి హాలీవుడ్ స్టార్ గెస్ట్
X
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చూపించినంత వేగం.. మరే స్టార్ హీరోకి సాధ్యం కాదు. వరుసగా ఏడాది మూడు నాలుగు చొప్పున సినిమాలు రిలీజ్ చేయగల సత్తా బాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. అయితే.. ఈ ఏడాది అక్షయ్ కి సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. ఎందుకంటే 2016లో ఇప్పటికి 3 సినిమాలు రిలీజ్ చేయగా.. అన్నింటితోనూ సక్సెస్ లు సాధించేశాడు. అంతే కాదు.. మూడు సినిమాలను వంద కోట్ల క్లబ్ లో చేర్చేసి హ్యాట్రిక్ సెంచరీలు కొట్టేశాడు.

ఎయిర్ లిఫ్ట్.. హౌస్ ఫుల్ 3.. రుస్తొం చిత్రాలను అక్షయ్ కుమార్ రిలీజ్ చేయగా.. అన్నీ భారీ సక్సెస్ లు సాధించాయి. అందుకే ఓ భారీ పార్టీ నిర్వహించాడు. దీనికి హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ వచ్చాడు. మరి హాలీవుడ్ స్టార్ దిగితే.. బాలీవుడ్ తారలు ఊరుకుంటారా? ఓ రేంజ్ లో పార్టీలో హంగామా సృష్టించేశారు. "గత రాత్రి డిన్నర్ కి ఎవరొచ్చారో తెలుసా.. ఇప్పుడు 'విల్'పవర్ లేదనే మాట ఇక అనకూడదంతే" అంటూ ట్వీట్ చేసింది అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా.

ఆలియా భట్.. సోనాక్షి సిన్హా.. ఈషా గుప్తా.. శ్రద్ధా కపూర్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి భామలతో పాటు.. రణబీర్ కపూర్.. వరుణ్ ధావన్.. అర్జున్ కపూర్.. కరణ్ జోహార్ లు కూడా ఈ పార్టీలో కనిపించారు. సాధారణంగా బాలీవుడ్ బాబులు భామలు కలిసి పార్టీలు చేసుకుంటారు కానీ.. ఈ రేంజ్ లో ఆ పార్టీ ఫోటోలను పబ్లిక్ లో పెట్టేయడానికి కారణం విల్ స్మిత్ ఆగమనమే.