మామగారికి సమంత పంచ్ ఇస్తుందా??

Fri Apr 21 2017 22:32:31 GMT+0530 (IST)

ఏప్రిల్ 20వ తేదీ సందర్భంగా అక్కినేని అభిమానులు మహా ఖుషీగా ఉన్నారు. 23 ఏళ్ల క్రితం ఇదే రోజన హలో బ్రదర్ మూవీ రిలీజ్ కావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. అదే సంబరాలను ఇవాళ తెగ చేసేసుకుంటున్నారు నాగార్జున అభిమానులు. ఆన్ లైన్ లో అయితే.. హలో బ్రదర్ పోస్టర్స్ తో హంగామా పీక్ స్టేజ్ లో ఉంది.

ఆ పోస్టర్లను చూశాకే కొందరికి ఓ డౌట్ వచ్చింది. ఈ పోస్టర్లు అప్పట్లో నానా హంగామా చేసిన మాట  వాస్తవమే కానీ.. ఇప్పుడు వీటిపై సమంత రియాక్ట్ అవుతుందా అన్నదే పాయింట్. హలో బ్రదర్ కి సమంతకి సంబంధం లేదు కానీ.. ఈ పోస్టర్లలోనే ఓ పాయింట్ ఉంది. గతంలో 1 నేనొక్కడినే మూవీ పోస్టర్ లో మహేష్ బాబు కాళ్ల వెనకాల కృతి సనోన్ పాక్కుంటూ వచ్చినట్లుగా డిజైన్ చేయడంపై.. సమంత చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హలో బ్రదర్ మూవీ పోస్టర్ లో.. నాగార్జున ఓ కాలు పట్టుకుని కూర్చుని ఉంటుంది హీరోయిన్ సౌందర్య.

మరి కాబోయే మామగారి పోస్టర్ పై సమంత రియాక్ట్ అవుతుందా అంటే కష్టమే అని చెప్పాలి. అయినా.. ఫిలిం ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్స్ ను తక్కువగా చూడ్డం అనే కాన్సెప్ట్ ఇప్పుడు కాదు.. ఎప్పటినుంచో ఉన్నదే కదా.. ఇప్పుడు సమంత మార్చేయగలదా ఏంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/