Begin typing your search above and press return to search.

పిల్లలకు ముందు 20 కావాలంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:33 PM GMT
పిల్లలకు ముందు 20 కావాలంటున్న హీరోయిన్
X
సీనియర్ బ్యూటీ హీరోయిన్ శ్రియా శరణ్ ఇప్పుడు పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ భామ.. కెరీర్ ను బాగానే మలుచుకుంది. బాలీవుడ్ హీరోయిన్ గా వెలిగిపోయింది. ఎక్కడ ఏ ఫిలిం ఈవెంట్ జరిగినా.. ఈమె ప్రెజెన్స్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రాం కచ్చితంగా ఉంటుందంటే అమ్మడి ట్యాలెంట్ అర్ధమవుతుంది.

అయితే.. ఇప్పుడీ బ్యూటీ పెళ్లి చేసుకుంది కదా.. ఇక సినిమాల సంగతి గతం గతం అంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇలా పెళ్లి చేసుకుందో లేదో.. ఇంతలోనే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు.. ప్రారంభించేసింది కూడా. మెగా డాటర్ నీహారికతో కలిసి సుజన దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసేసింది శ్రియ. మరి ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏంటంటే.. పిల్లలు ఎప్పుడూ అనే! ఇదే క్వశ్చన్ శ్రియకు కూడా ఎదురైంది. కానీ దీనికి ఈ బ్యూటీ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది.

పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కనే ఉద్దేశ్యం లేదని అందరూ అంటారు కానీ.. పిల్లలను కనేందుకు ఎంతో కొంత టైమ్ చెబుతూ ఉంటారు. కానీ శ్రియ ఆన్సర్ మాత్రం విచిత్రంగా ఉంది. తను పిల్లలను కనేందుకు ముందు కనీసం ఇంకో 20 సినిమాలు చేస్తుందట. అప్పటివరకూ పిల్లలు అనే మాట కూడా తలపెట్టదట ఈ భామ. ఏతావాతా ఇప్పుడు ఆమె చెబుతున్నదేంటంటే.. ఇకపై తను కెరీర మీదే దృష్టి పెడతానని స్ట్రెయిట్ గా చెప్పేసిందంతే.