Begin typing your search above and press return to search.

బిగ్ బాస్-3 వాయిదా ప‌డుతుందా?

By:  Tupaki Desk   |   16 July 2019 10:53 AM GMT
బిగ్ బాస్-3 వాయిదా ప‌డుతుందా?
X
వివాదాల్ని ముడి స‌రుకుగా మార్చి.. ప్ర‌జ‌ల్ని త‌మ మీద దృష్టి ప‌డేలా చేయ‌టంలో బిగ్ బాస్ స‌క్సెస్ అయ్యింద‌ని చెప్పాలి. ఈ కార‌ణంతోనే భాష ఏదైనా బిగ్ బాస్ షో అన్నంత‌నే వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్ప‌టం క‌నిపిస్తుంది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ వారాంతంలో బిగ్ బాస్ షో షురూ కానున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ షోలో త‌న‌ను ఎంపిక చేసి.. క‌మిట్ మెంట్ అడిగారంటూ తొలుత శ్వేతారెడ్డి.. త‌ర్వాత గాయ‌త్రి గుప్తాలు తెర ముందుకు రావ‌ట‌మే కాదు.. పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదులు కూడా చేశారు.

బిగ్ బాస్ -3 షో మీద వీరిద్ద‌రూ చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఈ షో మీద కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్ద‌రూ కోర్టును ఆశ్ర‌యించ‌టంతో ఈ షో అనుకున్న రీతిలో ఈ వీకెండ్ స్టార్ట్ అవుతుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ షోకు సంబంధించి ప‌లు వివాదాలు తెర మీద‌కు రావ‌టం.. సంచ‌ల‌న అంశాలు ఫిర్యాదులుగా మారిన నేప‌థ్యంలో బిగ్ బాస్ షోను అనుకున్న స‌మ‌యానికి అనుకున్న రీతిలో టెలికాస్ట్ చేస్తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

బిగ్ బాస్ రియాలిటీ షో పేరుతో ఈ షో నిర్వాహ‌కులు మ‌హిళ‌ల్ని మోసం చేస్తున్నార‌ని శ్వేతారెడ్డి చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె శ్రీ‌రెడ్డి ప్ర‌స్తావ‌న తెచ్చి.. ఆమెను అడ‌గ‌కూడ‌ని ప్రశ్న‌లు అడిగార‌ని.. గాయ‌త్రి గుప్తాను అగ‌డ‌కూడ‌నివి అడిగార‌ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మ‌రింత ఘాటుగా రియాక్ట్ అవుతూ.. బిగ్ బాస్ ముసుగులో చేయ‌కూడ‌నివి ఏవో చేసే బ‌దులు.. బ్లూ ఫిలింస్ చేసుకుంటూ స‌రిపోతుంది క‌దా? అంటూ ఫైర్ అయ్యారు.

బిగ్ బాస్ షోకు సంబంధించి కీల‌క వ్య‌క్తులుగా చెప్పే ర‌వికాంత్.. ర‌ఘు.. అభిషేక్.. శ్యాంల‌కు ముందుస్తు బెయిల్ ఇవ్వొద్ద‌ని కోరారు. త‌మ‌ను క‌మిట్ మెంట్స్ అడిగిన వారు వీరే కావ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే రెండు పోలీసు స్టేష‌న్లో బిగ్ బాస్ షోకు సంబంధించి కేసులు క‌ట్టి ఉన్న నేప‌థ్యంలో ఒక ఎత్తు అయితే.. తాజాగా కోర్టులో కూడా పిటిష‌న్ దాఖ‌లు చేయ‌టంతో ఈ షో అనుకున్న స‌మ‌యానికి ఎయిర్ అవుతుందా? అన్న‌ది పెద్ద సందేహంగా మారింది. షో ప్రారంభంపై రానున్న రెండు రోజుల్లో క్లారిటీ రావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.