Begin typing your search above and press return to search.

రాక్షసుడైనా హిట్ ఇస్తాడా ?

By:  Tupaki Desk   |   15 July 2019 10:29 AM GMT
రాక్షసుడైనా హిట్ ఇస్తాడా ?
X
డెబ్యూ మూవీ నుంచి భారీ కమర్షియల్ మాస్ మసాలా సినిమాలే చేస్తూ వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు విజయం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సరే కొత్తగా ట్రై చేద్దామని లేడీ ఓరియెంటెడ్ సీతను ఒప్పుకుంటే అది కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా అయితే లాభం లేదనుకున్నాడో ఏమో ఫైనల్ గా రీమేక్ ఫార్ములాను నమ్ముకున్నాడు శీను.

గత ఏడాది తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సైకో థ్రిల్లర్ మూవీ రట్ససన్ తెలుగులో రాక్షసుడిగా రీమేక్ వెర్షన్ లో సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 2న రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు సాయి శ్రీనివాస్. అలా అని తమిళ్ నుంచి తీసుకొచ్చిన ప్రతి హిట్ మూవీ ఇక్కడ ఆడిందని కాదు కానీ రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ కు విమర్శకుల నుంచి సైతం ప్రశంశలు దక్కాయి.

ఆ ఫీల్ చెడిపోకుండా యధాతధంగా తీసినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఒకవేళ మన ఆడియన్స్ కు ఇది కనెక్ట్ అయితే బెల్లం హీరోకు మొదటి హిట్ దక్కినట్టే. ఏ మాత్రం తేడా కొట్టినా కథ మళ్ళీ మొదటికే వస్తుంది. అందుకే రాక్షసుడు విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న సాయి శ్రీనివాస్ కు దీని రిజల్ట్ చాలా కీలకం. త్వరలో ఆడియోతో పాటు ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది.