Begin typing your search above and press return to search.

మళ్లీ మళ్లీ బాహబలి సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   28 July 2015 1:50 PM GMT
మళ్లీ మళ్లీ బాహబలి సాధ్యమేనా?
X
ప్రభాస్ అనగానే ఇప్పుడు మనకు బాహుబలి, శివుడు గుర్తుకొస్తున్నారు కానీ... రెండేళ్ల క్రితం వరకూ ప్రభాస్ పేరు చెప్పగానే... మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి లో కేరక్టర్సే మదిలో మెదిలేవి. మూడేళ్లపాటు కష్టపడి బాహుబలి చేశారు. మొదటి పార్ట్ రికార్డులన్నీ మోసుకుపోతోంది. వచ్చే ఏడాదిలో రానున్న బాహుబలి చివరి భాగంతో ఈ సీక్వెల్ పూర్తవుతుంది. అంటే ఒక్క ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడన్నమాట ప్రభాస్. మరి ప్రభాస్ తర్వాతేం చేస్తాడు ? ఎలాంటి సినిమాల్లో నటిస్తాడు ? ఈ డౌట్ మనకే కాదండోయ్... ఇంటర్నేషనల్ మేగజైన్ ఫోర్బ్స్ వాళ్లకీ వచ్చింది. అందుకే ఓ సలహా కూడా ఇచ్చేశారు.

బాహుబలి లాంటి అతి భారీ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్‌ ను.. ప్రభాస్ సరిగ్గా ఉపయోగించుకోవాలని, పెద్ద సినిమాలు చేయడం ద్వారా ఖ్యాతిని పెంచుకువాలని సూచించింది ఫోర్బ్స్. ఇందుకోసం రెండు ఉదాహరణలు కూడా ఇచ్చింది. స్టార్ వార్స్ ట్రయాలజీ తో, ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి మూవీలతో హాలీవుడ్‌‌ లో సూపర్ స్టార్‌ గా ఎదిగాడు హారిసన్ ఫోర్డ్. ఆ తర్వాత కూడా డిఫరెంట్ జోనర్ ఉన్న సినిమాలు చేస్తూ.. 40 ఏళ్లపాటు హాలీవుడ్‌ ని ఉర్రూతలూగించాడు.

అప్పటి స్టార్ వార్స్ ట్రయాలజీ లాంటిదే... లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కూడా. ఈ సినిమాలో ఫ్రోడో కేరక్టర్‌ లో నటించిన ఎలిజాఉడ్.. తర్వాత చిన్న సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసేశాడు. ఇప్పటికే అతన్ని మర్చిపోయే స్థితికి వచ్చేశారు జనాలు.

అందుకే సినిమా చరిత్రలో మిగిలిపోయే స్థాయికి వెళ్లాలంటే... హారిసన్ ఫోర్డ్‌ ని ఆదర్శంగా తీసుకుని.. జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటే... గ్రీకు శిల్పం మాదిరి బాడీ ఉన్ ప్రభాస్‌ కు.. సినిమా చరిత్రలో అత్యున్నత శిఖరాలు అందుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పింది ఫోర్బ్స్ పత్రిక. కానీ తెలుగులో బాహుబలి లాంటి సినిమాలు చాలా అరుదు. హిందీలో కూడా అరాకొరా గానే వస్తాయి ప్రయోగాత్మక చిత్రాలు. మరి ఇలాంటి సినిమాల్లోనే చేయాలంటే... అర్జంటుగా ప్రభాస్ హాలీవుడ్ వెళ్లాల్సిందే. చూద్దాం.. బాహుబలి ది కన్‌క్లూజన్ రిలీజయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ?