మంచి ఆలోచన కాని మరీ లేట్ అయ్యేలా ఉంది

Sun Feb 10 2019 18:01:03 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్ కెరీర్ గాడిలో పడుతుందని భావించిన అక్కినేని ఫ్యాన్స్ కు మిస్టర్ మజ్ను చిత్రం కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టర్ మజ్ను' చిత్రం కూడా అక్కినేని ఫ్యాన్స్ ను తృప్తి పర్చలేదు. వరుసగా మూడు సినిమాలు కూడా అఖిల్ కు స్టార్ డం కాదు కదా కనీసం సక్సెస్ ను కూడా తెచ్చి పెట్టలేక పోయింది. మిస్టర్ మజ్ను విడుదలైన రెండు వారాల్లోపే నాల్గవ సినిమా గురించిన వార్తలు మొదలు అయ్యాయి. అఖిల్ తదుపరి చిత్రాన్ని సత్య పినిశెట్టి దర్శకత్వంలో చేస్తాడని ఆ సినిమాను నాగార్జున నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఆ వార్తలు పుకార్లే అంటూ సినీ వర్గాల వారు కొట్టి పారేస్తున్నారు.అఖిల్ తన నాల్గవ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో టాప్ డైరెక్టర్స్ దర్శకత్వంలో చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకు వెయిట్ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోందతి. అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తో సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు. అయితే ప్రస్తుతం టాప్ దర్శకులుగా ఉన్న రాజమౌళి సుకుమార్ త్రివిక్రమ్ కొరటాల శివలు తమ తమ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలనే కాకుండా ఆ తర్వాత సినిమాలకు కూడా అడ్వాన్స్ తీసుకుని ఉండి ఉంటారు. అలాంటి వారితో సినిమా చేయాలంటే అఖిల్ చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది.

వెయిట్ చేసినా వారితో చేస్తే పక్కా సక్సెస్ వస్తుందా అంటే అది పూర్తి నమ్మకం లేదు. అఖిల్ అదృష్టం బాగాలేకపోతే దాని ఫలితం కూడా తారుమారు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే అఖిల్ వారికోసం వెయిట్ చేయడం అనేది వృదా ప్రయాస అని ఆ దర్శకులతో సినిమా చేయాలనే నిర్ణయం మంచిదే కాని మరీ ఆలస్యం చేయడం వల్ల కూడా ప్రేక్షకుల్లో అసహనం అనాసక్తి పెరుగుతుందేమో చూసుకోవాలి. అక్కినేని ఫ్యాన్స్ కోసం అయినా అఖిల్ ఒక గట్టి సక్సెస్ కొడితే బాగుండు..!