Begin typing your search above and press return to search.

రంగంలోకి దిగిన అఖిల్ 4

By:  Tupaki Desk   |   15 July 2019 9:45 AM GMT
రంగంలోకి దిగిన అఖిల్ 4
X
అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ కెరీర్ ఆశించిన విధంగా సాగకపోవడం నిజంగా వింతే. ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్ళు దాటినా కేవలం మూడు సినిమాలు మాత్రమే చేయడం అవి ఏవి కనీస స్థాయిలో ఆడకపోవడం అఖిల్ ని ఎప్పటికప్పుడు డిఫెన్స్ లో పడేస్తూనే ఉన్నాయి. ఫాంలో ఉన్న దర్శకుడిని తీసుకున్నా హీరొయిన్ కాంబినేషన్ ఫ్రెష్ గా సెట్ చేసుకున్నా ఏదీ వర్క్ అవుట్ కావడం లేదు.

మిస్టర్ మజ్ను తర్వాత ఐదు నెలల గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇటీవలే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. పూజైతే గత నెలే చేశారు కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ రోజు నుంచి కూకట్ పల్లిలో మొదలైంది. అఖిల్ పాల్గొంటున్న కొన్ని సన్నివేశాలు ఇందులో చిత్రీకరిస్తున్నారు

ఇంకా హీరొయిన్ ఫైనల్ కాని ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. రెండో షెడ్యూల్ నుంచి మిగిలిన కీలక తారాగణంతో పాటు హీరొయిన్ కూడా పాల్గొనేలా ప్లాన్ చేశారు. అఖిల్ పక్కన సందడి చేయబోయే భామ ఎవరో మాత్రం సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు అఖిల్.

కాని బొమ్మరిల్లు భాస్కర్ ఏ మాత్రం ఫాం లో లేకపోవడం ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్నా గీతా బ్యానర్ ఏ కథను ఏ దర్శకుడిని అంత ఈజీగా ఓకే చేయదన్న నమ్మకం వాళ్ళకు బలాన్నిస్తోంది. హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్న అఖిల్ కు ఇదైనా బోణీ కొట్టిస్తుందో లేదో వేచి చూడాలి