Begin typing your search above and press return to search.

వైఫ్.ఐ తో దాడికి సిద్ధమవుతున్న టెంప్ట్ రవి

By:  Tupaki Desk   |   19 July 2019 7:34 AM GMT
వైఫ్.ఐ తో దాడికి సిద్ధమవుతున్న టెంప్ట్ రవి
X
'ఏడుచేపల కథ' పేరు వినని.. టెంప్ట్ రవి గురించి కనీసం తెలియని తెలుగు నెటిజన్లు దాదాపుగా ఉండరు. టీజర్.. ట్రైలర్లతో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. టెంప్ట్ రవి పాత్రలో అమాయకత్వం మిక్స్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ దెబ్బకు హీరో అభిషేక్ రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. సడెన్ గా అభిషేక్ రెడ్డి అని అడిగితే ప్రేక్షకులు జవాబు చెప్పలేరేమో కానీ టెంప్ట్ రవి ఎవరు అని అడిగితే టక్కున చెప్పేస్తారు.

ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడు ఎందుకంటే ఈ అభిషేక్ రెడ్డి హీరోగా నటించిన మరో చిత్రం రెడీ అవుతోంది. సినిమా టైటిల్ 'వైఫ్.ఐ'. ఈ సినిమాకు క్యాప్షన్ 'నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్'. జీఎస్ ఎస్ పీ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఇది. భార్యా భర్తల మధ్య ఉండే గొడవలు.. ప్రేమ.. తదితర అంశాలపై సాగుతుందట. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తామని నిర్మాతలు వెల్లడించారు.

ఈ సినిమాలో అభిషేక్ రెడ్డి సరసన సాక్షి నిదియా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో కావ్య‌.. సునీల్ న‌గ‌రం.. సూర్య ఆకొండి.. మ‌హేష్ విట్ట‌.. అప‌ర్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం వినోద్ యాజమాన్య. 'వైఫ్.ఐ' చిత్రాన్ని ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్.. జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.