Begin typing your search above and press return to search.

స్టార్లు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా

By:  Tupaki Desk   |   19 Feb 2019 5:09 AM GMT
స్టార్లు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా
X
సరిగ్గా 24 ఏళ్ళ క్రితం 1995లో చిరంజీవి ఏ సినిమా విడుదల కాలేదు. అప్పట్లో ఇదో పెద్ద సెన్సేషన్. మెగాస్టార్ ఏడాది పాటు మేకప్ వేసుకోలేదట అని ఒకరు పన్నెండు నెలల్లో ఒక్క సినిమా లేకుంటే ఎలా అని మరొకరు రకరకాలుగా చెప్పుకునేవారు. ఆ తర్వాత సంవత్సరం హిట్లర్ తో బ్లాక్ బస్టర్ కొట్టాక మళ్ళి ఆయన కుదురుకున్నారు. దానికి కారణం రెండు మూడేళ్ళ పాటు తన స్థాయికి తగ్గ సినిమా లేక వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి కావడంతో చిరు అప్పుడు ఆ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.

అప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది పాటు ఒక స్టార్ హీరో సినిమా లేకపోవడం అన్నది చిన్న సంగతి కానే కాదు. ఇప్పుడంతా సీన్ రివర్స్. ఏడాది గ్యాప్ చాలా మాములు విషయమైపోయింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య గత ఏడాది మేలో విడుదలైతే ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. మార్చ్ లో స్టార్ట్ అనుకున్నా ఎంత లేదన్నా ఆరు నెలలు కావాలి. పద్దెనిమిది నెలలు బన్నీ సినిమా లేనట్టేగా

ఇక మహేష్ బాబు భరత్ అనే నేను విడుదలైంది గత ఏడాది ఏప్రిల్ 20న. ఇప్పుడు మహర్షి సంవత్సరం తర్వాత ఐదు రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 25న వష్తోంది. ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళికి లాక్ అయిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కు అరవింద సమేత తర్వాత ఇరవై నెలల దాకా గ్యాప్ వచ్చే అవకాశం ఉండగా రామ్ చరణ్ కు వినయ విధేయ రామ తర్వాత 16 నెలలకు పైగా ఎదురు చూపులు తప్పవు.

ఇక ప్రభాస్ సంగతి సరేసరి. బాహుబలి 2 వచ్చిన రెండేళ్ల తర్వాత సాహో వస్తోంది. ఇదంతా పరిస్థితుల ప్రభావం అని సదరు హీరోలు చెప్పుకున్నా కొంత వేగం అయితే చాలా అవసరం. స్టార్ల సినిమాలు ఎక్కువగా వస్తే థియేటర్లు కళకళలాడుతాయి. ప్రేక్షకులు సినిమా హాళ్లకు కదులుతారు. ఇలా ఏడాదికి ఒకటి రెండేళ్లకు ఒకటి చేస్తూ పోతే కెరీర్ మొత్తంలో హాఫ్ సెంచరీ దాటడం కూడా గొప్పే అనుకోవాలి.