Begin typing your search above and press return to search.

అయ్యబాబోయ్.. అన్ని కార్లు ఒక సినిమాకా??

By:  Tupaki Desk   |   16 July 2019 6:20 AM GMT
అయ్యబాబోయ్.. అన్ని కార్లు ఒక సినిమాకా??
X
డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కడంతో హై ఎండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేన్నీ బేట్స్ ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ ను పర్యవేక్షించారు.

ముఖ్యంగా దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ కు భారీ స్థాయిలో ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దుబాయ్ ఎపిసోడ్ మాత్రమే కాదు ఇతర యాక్షన్ బ్లాక్స్ కోసం కూడా విరివిగా కార్లను వినియోగించారట. ఈ సినిమాలో ఎన్ని కార్లు వాడారో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవల్సిందే. సినిమాలో మొత్తం 120 కార్లను వాడడం జరిగిందట. వీటిలో ఒక్క దుబాయ్ ఛేజింగ్ సీక్వెన్స్ లో 56 కార్లను వాడడం గమనార్హం. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ కోసం ఒక ప్రత్యేకమైన ట్రక్కును రెడీ చేయాల్సి వచ్చిందట. ఈ సినిమాలోనే మరో యాక్షన్ సీక్వెన్స్ కోసం 18 కార్లను యూజ్ చేశారట. ఈ ముఖ్యమైన ఎపిసోడ్స్ కాకుండా ఇతర సీన్ల కోసం మిగతా కార్లను వాడడంతో మొత్త కార్ల కౌంటు 120 గా లెక్క తేలిందట.

ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాకు ఈ రేంజ్ లో కార్లను వాడడం కామనేమో కానీ భారతదేశంలో ఒక సినిమాకు ఇలా వాడడం మాత్రం మొదటి సారి.. ఒకరకంగా ఇదో రికార్డు అని చెప్పవచ్చు. మరి ఇంత భారీ స్థాయిలో కార్లను వాడినందుకు.. వాటికోసం కోట్లరూపాయలను నిర్మాతలు వంశీ ప్రమోద్ ఖర్చు చేసినందుకు స్క్రీన్ పై ఆ ఫలితం కనిపిస్తే మంచిదే కదా. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కనుక క్లిక్ అయితే మరికొందరు ఫిలిం మేకర్స్ 'సాహో' ను ఫాలో అవడం ఖాయమే.