ఇంత సైలెన్స్ ఏంటి ?

Thu Dec 06 2018 12:40:52 GMT+0530 (IST)

2.0 సందడి తక్కువ టైంలోనే సద్దుమణుగుతోంది కాబట్టి సినిమా ప్రేమికుల చూపు రేపు శుక్రవారం రాబోతున్న కొత్త సినిమాల మీద పడింది. అయితే విచిత్రం గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం తప్పిస్తే ఇంకేదీ ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సందీప్ కిషన్-నవదీప్ హీరోలు గా తమన్నా మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటించిన నెక్స్ట్ ఏంటి రేపు రేస్ లో ఉంది. అమీర్ ఖాన్ తో ఫనా లాంటి మాస్టర్ పీస్ ని రూపొందించిన కునాల్ కోహ్లీ దీని ద్వారా టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమవుతున్న సందడి కించిత్ కూడా కనిపించడం లేదు.అసలే చాలా ప్రతికూలతలు మధ్య నెక్స్ట్ ఏంటి వస్తోంది. నవదీప్ ని హీరో గా చూసేందుకు పబ్లిక్ రెడీగా లేరు. ఏనాడో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నవదీప్ ఎంత స్టైలిష్ గా లుక్ మార్చుకున్నా ఇప్పటికిప్పుడు జనల దృష్టిని లాగేంత సీన్ లేదు.

ఇక సందీప్ కిషన్ సంగతి సరేసరి. టీవీ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వచ్చినప్పుడు తప్ప తనో హీరో అన్న సంగతి కూడా గుర్తుకురాలేంత దారుణమైన ట్రాక్ రికార్డు తో ఉనికి కోసం పోరాడుతున్నాడు. సో హీరోల పేరు మీద ఓపెనింగ్స్ రావడం జరగని పని. ఉన్న ఒక్క హోప్ తమన్నా. తనైనా డిమాండ్ లో ఉన్న పీక్స్ హీరోయిన్ కాదు. ఇంతకు ముందున్నంత మార్కెట్ లేదు. అందుకే కళ్యాణ్ రామ్- సందీప్ కిషన్ ఇలా ఇమేజ్ తక్కువగా ఉన్న హీరోలతో జత కడుతోంది.

సో మిల్కీ బ్యూటీ ని చూసేందుకే థియేటర్ దాకా వచ్చే ప్రేక్షకులు ఎందరు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా. దానికి తోడు నెక్స్ట్ ఏంటి టైటిల్ సినిమా థీమ్ కి విరుద్ధంగా ఏదో హారర్ ఫిలింకి పెట్టినట్టు సెట్ చేసారు. గత ఏడాది వచ్చిన నెక్స్ట్ నువ్వే సౌండింగ్ వినిపిస్తే అది ఎవరి తప్పూ కాదు. సో ఇన్ని నెగటివ్ వైబ్రేషన్స్ కి తోడు దొరికిన తక్కువ స్క్రీన్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ప్రోత్సాహాకరంగా లేవు. అసలు ఈ నెక్స్ట్ ఏంటి ఎందుకు ఇంత సైలెన్స్ లో వస్తుందో సదరు దర్శక నిర్మాతలకైనా తెలుసో లేదో