మహేష్ ముంబయి వెళ్లింది అందుకా?

Thu Jun 14 2018 15:47:55 GMT+0530 (IST)

మహేష్ బాబు కెరీర్ లో ఒకటి రెండు సినిమాలు మినహాయించి ఒకటే లుక్ లో కనిపించాడు. స్టయిలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో కావడంతో ప్రేక్షకులు కూడా మహేష్ ను అలాగే ఇష్టపడుతూ వచ్చారు. 25 సినిమాల మైలురాయికి చేరిన మహేష్ ఈసారి మాత్రం ఓ సరికొత్త లుక్ లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయాలని అనుకుంటున్నాడు.తాజాగా భరత్ అనే నేను సినిమాతో యంగ్ చీఫ్ మినిస్టర్ గా కనిపించి అదరగొట్టిన మహేష్ తరవాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే స్టయిల్ మార్చాడు. ఒత్తుగా జుట్టు.. గడ్డం కూడా పెంచాడు. ఎప్పుడు క్లీన్ షేవ్ లో.. మీసం లేకుండా కనిపించే అతడిని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇదే టైంలో మహేష్ ముంబయి కూడా వెళ్లొచ్చాడు. దీంతో మహేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని టాలీవుడ్ లో రూమర్ వచ్చేసింది. కానీ మహేష్ ముంబయికి వెళ్లింది కొత్త మేకోవర్ కోసమట.

ఇందుకోసం ముంబయిలో సెలబ్రిటీ స్టయిలిస్ట్ హకీమ్ ఆలిమ్ గైడెన్స్ తీసుకుంటున్నాడు. హకీమ్ ఆలిమ్ బాలీవుడ్ లో ఎందరో పెద్ద హీరోలకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న లుక్ పట్ల కూడా మహేష్ హ్యాపీగా లేడని తెలుస్తోంది. తరవాత సినిమాలో కంప్లీట్ గా కొత్తగా కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. షూటింగ్ స్టార్టయ్యాక హకీమ్ కూడా హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఏ మేరకు థ్రిల్ చేస్తారో చూడాలి.