Begin typing your search above and press return to search.

మూసలో పడిపోయిన టాలీవుడ్ సూపర్ స్టార్??

By:  Tupaki Desk   |   14 Jun 2019 9:02 AM GMT
మూసలో పడిపోయిన టాలీవుడ్ సూపర్ స్టార్??
X
సూపర్ స్టార్ మహేష్ బాబుకు మొదటి నుంచి రిస్కీ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తాడని.. సబ్జెక్టుల విషయంలో కూడా ఎక్స్ పరిమెంట్లు చేస్తాడని పేరుండేది. అయితే ఈమధ్య స్లో గా స్టార్ డమ్ చట్రంలో పడిపోయి రొటీన్ సినిమాలు చేస్తున్నాడనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతే కాదు సూపర్ స్టార్ సినిమా అంటే సందేశాల సినిమా అనే ఒపీనియన్ కూడా చాలా మందిలో కలుగుతోంది.

మహేష్ బాబు నటించిన గత నాలుగైదు చిత్రాలు పరిశీలిస్తే 'శ్రీమంతుడు' గ్రామాలను దత్తత తీసుకోవడంపై సందేశం. 'బ్రహ్మోత్సవం' లో బంధువులతో ఉండాలి.. చుట్టాలందరూ కలవాలని సందేశం. 'భరత్ అనే నేను' లో రాజకీయాలు ఎలా ఉండాలి.. పౌరులు ఎలా ఉండాలనే దానిపై సందేశం. 'మహర్షి' లో రైతుల సమస్యలపై సందేశం. 'స్పైడర్' లో సందేశం లేదని అనుకుంటారేమో.. ఉంది కానీ అది మురుగదాస్ సారుకే సరిగా అర్థం కాలేదు.. జనాలకేం అర్థం అవుతుంది? ఇదిలా ఉంటే 'మహర్షి' ని మహేష్ అండ్ టీం ఎంతో గొప్పగా ఎపిక్ బ్లాక్ బస్టర్ అని ప్రమోట్ చేసిన రెండు ఏరియాల్లో నష్టం వచ్చిన సంగతి జనాలకు తెలుసు.

సందేశాలు పక్కన పెడితే గతంలో మహేష్ సినిమాల్లో కనిపించిన వైవిధ్యం ఇప్పుడు మిస్ అవుతోంది. కథల విషయంలోనే కాకుండా మహేష్ సేమ్ లుక్ ను మెయింటెయిన్ చెయ్యడం కూడా మహేష్ సినిమాలను రొటీన్ అనిపించేలా చేస్తోంది. లుక్స్ విషయం మాత్రం 'మహర్షి' కొంత బెటర్. నిజానికి మహేష్ తన డైరెక్టర్ల ఎంపికలోనే వైవిధ్యం మిస్ అవుతోంది అంటున్నారు. మహేష్ నెక్స్ట్ సినిమా ఒక మసాలా ఎంటర్టైనర్ అంటున్నారు. సో..సందేశం ఉండకపోవచ్చు కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కథను మాత్రం ఆశించలేం. అదే సినిమాను మహేష్ సుకుమార్ తో చేస్తే ఆ సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ ఫిలిం అయి ఉండేది. మరోవైపు సందీప్ వంగా తో కూడా సినిమా అన్నారు కానీ ఇప్పుడు అది కూడా అటకెక్కేలా ఉంది. సందీప్ ల్లాంటి న్యూ జెన్ ఫిలిం మేకర్ తో చేయడం మహేష్ కు డిఫరెంట్ గా ఉండేది కానీ మళ్ళీ వంశీ పైడిపల్లితోనే సినిమా చేస్తాడని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మహేష్ తన స్టార్డమ్ చట్రంలో ఇరుక్కున్నాడని .. కొత్తగా ప్రయత్నించడం లేదని.. రిస్క్ తీసుకోవడం లేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీని కారణంగానే ఓవర్ సీస్ లో మహేష్ సినిమాకు రెస్పాన్స్ తగ్గి ఉండొచ్చని ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది.