Begin typing your search above and press return to search.

కట్టప్ప సీక్రెట్ తెలిస్తే పెద్ద దెబ్బే

By:  Tupaki Desk   |   24 April 2017 1:36 PM GMT
కట్టప్ప సీక్రెట్ తెలిస్తే పెద్ద దెబ్బే
X
బాహుబలి2ను ఫ్లాప్ అయితే.. తప్పు కట్టప్పదా! బాహుబలి మూవీ చూసి నిరుత్సాహ పడ్డ వారు చాలామందే ఉంటారు. అసలు రాజమౌళి సినిమా మాదిరిగా లేదని కొందరు.. యుద్ధం తప్ప మరేమీ లేదని ఇంకొందరు విమర్శలు చేశారు. అయితే.. మొదటి భాగంలో కేరక్టర్ ఇంట్రడక్షన్ చేశామని.. రెండో భాగంలో కథ ఉంటుందని కవర్ చేసుకున్నారు బాహుబలి2 టీం.

అయితే.. ఇప్పుడు బాహుబలి2ని ఎందుకు చూడాలి అనే ప్రశ్న ఎవరినైనా అడిగితే.. ఆ సినిమా గ్రాండియర్ చూడ్డానికి అనే సమాధానం అయితే రాదు. అందరూ చెప్పే మాట 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసమే' అంటారు. బాహుబలి టీం కూడా ఇదే విషయాన్ని దాచి పెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. కానీ కట్టప్ప అలా ఎందుకు చేశాడో తెలుసుకునేందుకు సినిమాకి వెళ్లాల్సిన పనేమీ ఉండదు కదా. మూవీ రిలీజ్ రోజున తొలి ఆట పడేంత వరకే. ఆ తర్వాత ఈ విషయం వైరల్ అయిపోతుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో జనాలకు తెలిసిపోతుంది.

తెలిశాక కూడా సినిమాకి వెళ్లాలనేంత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలగడమే ఇప్పుడు అసలు సిసలైన సవాల్. ఇదే అసలు సిసలైన సీక్రెట్ అంటూ బాహుబలి టీం కట్టప్ప విషయంలో చేసిన అనవసరపు హంగామా.. బూమరాంగ్ అయినా ఆశ్చర్యం లేదు. కట్టప్ప సీక్రెట్టే కొంపముంచే ఛాన్సుంది. మొదటి ఆటతో తెలిసిపోయే ఆ సీక్రెట్ లో పెద్ద విషయం లేకపోతే మాత్రం సినిమాకు పెద్ద దెబ్బే. ఒక వేళ సినిమా రిజల్ట్ లో తేడా వస్తే.. ఆ తప్పు కట్టప్పదా? లేక ఇలాంటి పబ్లిసిటీ ఆలోచన చేసిన వాళ్లదా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/