Begin typing your search above and press return to search.

ట్రిప్ కి టైం ఉంది రామ్ !

By:  Tupaki Desk   |   16 July 2019 11:02 AM GMT
ట్రిప్ కి టైం ఉంది రామ్ !
X
మొదటిసారి కెరీర్ లో ఊర నాటు మాస్ అవతారంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ విడుదల రోజుల్లో నుంచి గంటల్లోకి మారిపోయింది. ఎల్లుండి గ్రాండ్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసేశారు. చాలా గ్యాప్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద వస్తున్న మాస్ మూవీ కావడంతో ట్రేడ్ కూడా దీని మీద చాలా నమ్మకంతో ఉంది. అయితే ఇలాంటి ఎగ్జైటింగ్ మూమెంట్ లో రామ్ ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ కు బయలుదేరడం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి హీరో అందుబాటులో ఉండాల్సింది ఇప్పుడే. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కీలకంగా మారుతోంది. టాక్ ఏ మాత్రం డివైడ్ గా ఉన్నా యావరేజ్ రిపోర్ట్స్ వినిపించినా వసూళ్లు పెంచడానికి స్టార్ క్యాస్ట్ మొత్తం రంగంలోకి దిగాల్సిందే. ఓ బేబీకి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినా సమంతా పట్టువదలకుండా కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ వివిధ ప్రాంతాలు తిరగేసింది. మరి రామ్ ఇలా వెళ్లిపోవడం ఏమిటి అనే అనుమానం రావడం సహజం.

అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం రామ్ ఇది సడన్ గా ప్లాన్ చేసింది కాదట. కుటుంబం అంతా కలిసి ఇలాంటి లాంగ్ ఫారిన్ ట్రిప్ వేసే ప్లాన్ ఎప్పుడో జరిగిందట. దానికి తగ్గట్టే టికెట్లు బుక్ చేసుకున్నారు. ముందు ఇస్మార్ట్ శంకర్ మే లేదా జూన్ ఉంటుంది కాబట్టిసమస్య లేదనుకున్నారు. తర్వాత జూలై 12కి మారినా పర్వాలేదు అనుకున్నారు. కానీ వరల్డ్ కప్ కోసం 18 షిఫ్ట్ చేయడంతో ఇలా అయిపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ చేసే మూడ్ లో రామ్ లేడని ఆ ఛాన్స్ కూడా లేదని సన్నిహితుల మాట. కొంత నష్టమైనా ఆగిపోయి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ చేసుకుంటే బెటర్ కదా అనే మాట వినిపిస్తోంది కానీ ఇక భారమంతా పూరి అండ్ నిధి నభలదే