Begin typing your search above and press return to search.

ప్ర‌మోష‌న్స్ కి రామ్ డుమ్మా.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   18 July 2019 7:25 AM GMT
ప్ర‌మోష‌న్స్ కి రామ్ డుమ్మా.. కార‌ణ‌మిదే!
X
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన `ఇస్మార్ట్ శంక‌ర్` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కి రామ్ దూరంగా ఉండ‌డంపై ఫిలిం మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ రామ్ ఏమ‌య్యాడు? ద‌ర్శ‌కుడు పూరి స‌హా క‌థానాయిక‌లు నిధి అగ‌ర్వాల్ .. న‌భా న‌టేష్ ఇంట‌ర్వ్యూల‌తో ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంటే టైటిల్ పాత్ర‌ధారి అయిన రామ్ ఎందుకు మిస్స‌యిన‌ట్టు? అటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఒక‌వేళ పూరి అండ్ టీమ్ పై రామ్ అలిగారా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేశారు కొంద‌రైతే.

అయితే ప్ర‌మోష‌న్స్ నుంచి రామ్ మిస్సింగ్ కి అస‌లు కార‌ణం తెలిసింది. ఇస్మార్ట్ రామ్ ప్ర‌స్తుతం కుటుంబ స‌మేతంగా స్పెయిన్ లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ వేళ ప్ర‌చారం చేయ‌కుండా ఈ టైమ్ లో జాలీ ట్రిప్ లేంటి? అన్న సందేహం వ్య‌క్తం చేస్తే అందుకు ఇస్మార్ట్ టీమ్ ద‌గ్గ‌ర స‌మాధానం కూడా దొరికింది. నిజానికి రామ్ అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది ఇంకొకటి. ఈనెల‌ 12 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కార‌ణాల వ‌ల్ల 18కి వాయిదా ప‌డ‌డంతో .. ముందే ప్లాన్ చేసిన ట్రిప్ ని క్యాన్సిల్ చేయ‌లేకపోయాడ‌ట‌. తానొక్క‌డే వెకేష‌న్ కి వెళ్లేట్టు అయితే టిక్కెట్ క్యాన్సిల్ చేసేవాడే. కుటుంబ స‌మేతంగా అంద‌రికీ స్పెయిన్ కి రాను పోను విమానం టిక్కెట్లు బుక్క‌యిపోయాయి. అంత పెద్ద వెకేష‌న్ ప్లాన్ స‌డెన్ గా డ్రాప‌వ్వాలంటే చాలానే న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. అందుకే క్యాన్సిల్ చేయ‌లేక వెకేష‌న్ కి వెళ్లాల్సి వ‌చ్చింద‌ట‌.

ఇలాంటి త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌ల్ల‌నే ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌చారానికి రామ్ మిస్స‌వుతున్నార‌ని తెలిసింది. అయితే జూలై 12 తేదీని దృష్టిలో పెట్టుకుని చాలా ముందే రామ్ ప‌లు మీడియాల‌తో చిట్ చాట్ లు చేయ‌డంతో ఆ వీడియోలు ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ట‌. ఇక కెరీర్ ప‌రంగా రామ్ కి చాలా కాలంగా ఫ్లాపులు ఎదుర‌వుతూ ఉన్నాయి. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పూరి లాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ తో సినిమా చేశాడు. అప్ప‌టికే ఫ్లాపులతో ఇబ్బంది ప‌డుతున్న పూరీతో ధైర్యంగా క‌లిసి ప‌ని చేశాడు. అయితే నేడు రిలీజైన ఇస్మార్ట్ శంక‌ర్ కి క‌లెక్ష‌న్లు బావున్నా స‌మీక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. మ‌రి రివ్యూల‌తో ప‌ని లేకుండా మాస్ లోకి ఈ సినిమా దూసుకెళుతుందా.. తొలి వీకెండ్ త‌ర్వాతా వ‌సూళ్ల దూకుడు సాగుతుందా.. అస‌లేం జ‌ర‌గ‌నుంది? అన్న‌ది వేచి చూడాల్సిందే.