Begin typing your search above and press return to search.

అందుకే ఏక్తా క‌పూర్ పెళ్లి చేసుకోలేద‌ట‌!

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:39 AM GMT
అందుకే ఏక్తా క‌పూర్ పెళ్లి చేసుకోలేద‌ట‌!
X
ప్ర‌ముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత ఏక్తాకపూర్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర లేదు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా...డైరెక్ట‌ర్ గా బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏక్తా క‌పూర్ ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల పై ఫోక‌స్ పెట్టారు. బుల్లితెర బ‌డా ప్రొడ్యూస‌ర్ గా పాపుల‌ర్ అయిన ఏక్తా....ఆ త‌ర్వాత వెండితెర‌ మీద త‌న స‌త్తా చాటారు. అయితే, ఇంత స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ కొన‌సాగిస్తోన్న ఏక్తా...ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను మాత్రం సాక్రిఫైజ్ చేశారు. ఇంకా అవివాహిత‌గా ఎందుకు కొన‌సాగుతున్నారంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ఆమెకు ప్ర‌శ్న ఎదురైంది. దానికి ఏక్తా ఆస‌క్తిక‌రం స‌మాధాన‌మిచ్చారు. త‌న‌కు తండ్రి రెండు ఆప్ష‌న్స్ ఇచ్చార‌ని...వాటిలో తాను సినిమాను సెలెక్ట్ చేసుకున్నాన‌ని అన్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు తాను పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి గల కార‌ణాల‌ను ఏక్తా క‌పూర్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో త‌న‌కు త‌న తండ్రి జితేంద్ర రెండు ఆప్ష‌న్లు ఇచ్చార‌ని , ‘పెళ్లి చేసుకుంటావా? లేక ఇండస్ట్రీలో పనిచేస్తావా?’ అని ఛాయిస్ ఇచ్చార‌ని చెప్పారు. త‌న‌కు సినిమాలు, సీరియ‌ళ్లు అంటే ఇష్ట‌మ‌ని..అందుకే తాను పనిచేసేందుకే మొగ్గు చూపానని తెలిపారు. మహిళా దర్శక నిర్మాతగా తాను ప్ర‌తిరోజు ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఆ కార‌ణంతోనే ఇన్నాళ్లూ పెళ్లికి దూరంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం 5 సినిమాలతో పాటు - 10 సీరియళ్లను రూపొందిస్తున్నాన‌ని, వెబ్ సిరీస్‌ ను కూడా సిద్ధం చేశాన‌ని చెప్పారు. గ‌తంలో త‌న సీరియ‌ల్లో న‌టించిన‌ స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ఉన్నార‌ని - అయినా తమ స్నేహం కొనసాగుతోంద‌ని అన్నారు. రాజకీయాల‌పై త‌న‌కు ఆస‌క్తి లేద‌ని చెప్పారు.