Begin typing your search above and press return to search.

ఈసారి కూడా సందెట్లో సడేమియానేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2018 11:09 AM GMT
ఈసారి కూడా సందెట్లో సడేమియానేనా?
X
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌ గా రాణించడం కష్టం అనుకుంటున్న సమయంలో ఈషా రెబ్బా హీరోయిన్‌ గా పరిచయం అయ్యి కాస్త పేరు తెచ్చుకుంది. ఉత్తరాది హీరోయిన్స్‌ కు తగ్గకుండా తాను కూడా గ్లామర్‌ పాత్రలు చేస్తానంటూ చెబుతోంది. అయితే ఈమెకు చిన్న చిన్న చిత్రాలు తప్ప పెద్ద సినిమాల్లో ఛాన్స్‌ లు అంతగా రావడం లేదు. త్రివిక్రమ్‌ అరవింద సమేత చిత్రంలో ఈషాకు సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఈషా దశ తిరిగినట్లే అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆ చిత్రంలో ఈషా ఉందా అన్నట్లుగా ఆమె పాత్ర ఉంది.

అరవింద సమేత ఆమెను తీవ్రంగా నిరాశ పర్చింది. ఈ సమయంలోనే సుమంత్‌ తో ఒక చిత్రంలో ఈషా నటించింది. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు ‘ఎన్టీఆర్‌’ మూవీలో ఈషా కు క్రిష్‌ ఒక పాత్ర ఆఫర్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం పెద్ద సినిమానే అయినప్పటికి అందులో లెక్కకు మించి స్టార్స్‌ ఉన్నారు. కనుక ఈషా ఈసారి కూడా ఉందా లేదా అన్నట్లుగానే కనిపిస్తుందేమో.

పెద్ద హీరోల సినిమాల్లో ఈషాకు ఛాన్స్‌ లు రావడమే గగనం అయ్యింది. ఒక వేళ వచ్చినా సందట్లో సడేమియా అన్నట్లుగానే ఆమె పాత్ర ఉంటుంది. చిన్న చిత్రాలతో పెద్ద సక్సెస్‌ లను దక్కించుకుంటే అప్పుడు ఈమెకు ఏమైనా ఛాన్స్‌ లు వస్తాయేమో చూడాలి.